special Stories

special Stories

ఆట అక్కడే మోదలైంది”తెలంగాణీయం”!? 

“పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత “మోషా”ల తదుపరి కార్యక్షేత్రం తెలంగాణానే.అయితే అనుకోని విధంగా తెలంగాణా బీజేపీ లో కీలకపాత్ర మధ్య అనైక్యత,పదవుల చదరంగం తో పనికాదని గ్రహించిన కేంద్ర పెద్దలు తమదైన శైలిలో వికెట్లు కదిలించడం మొదలెట్టారు.ఈ దశలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరద్ వ్యవహారం బయట పడడం పోక్సో కేసు…

ప్రజాస్వామ్య పునర్నిర్మాణం: బ్యూరోక్రసీ విచక్షణ నుండి పౌర సార్వభౌమత్వానికి ‘మూడో స్తంభం’ రోడ్‌మ్యాప్

“వోటు హక్కును ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కుగా మార్చడం, ఎన్నికల సంఘాన్ని మరింత బహుళ-సభ్యులతో కూడిన జవాబుదారీ సంస్థగా విస్తరించడం, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ “జిల్లా పౌర హక్కుల అథారిటీ” అనే మూడో స్తంభాన్ని ప్రతిష్టించడం, మరియు అధికారుల బ్యూరోక్రాటిక్ నిరంకుశత్వాన్ని అరికట్టేలా ‘ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ అథారిటీ’ (ICA) వంటి సరికొత్త అఖిల భారత సర్వీసును…

రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన…

Two and a Half Years of Congress Rule Promises, Performance and Public Verdict

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చి రెండున్నరేళ్లు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వం పనితీరుపై సమీక్ష జరగడం సహజమే కాక అవసరం కూడా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం ప్రభుత్వాలను మార్చే ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు, అసంతృప్తికి, భవిష్యత్తుపై వారి కలలకు ప్రతిబింబం. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజల ముందుకు తీసుకొచ్చే హామీలు…

పటేల్ నుంచి పవన్ దాకా తెలంగాణపై అవే కుట్రలు.!!

“తెలంగాణవాదం దేశానికి ప్రమాదమంటూ ప్రచారం మొదలు పెట్టి, తెలంగాణవాదులు జాతీయ భద్రతకు విఘాతం కల్పిస్తారంటూ నాడు జాతీయవాదం ముసుగులో పటేల్‌ సైన్యం కమ్యూనిస్టులను నిర్మించినట్లే. నేడు పవన్‌ అండ్ ఎన్డీయే కూటమి తెలంగాణవాదులను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న తెలంగాణ ప్రమాదంలో పడుతుంది. ప్రజల అప్రమత్తతే తెలంగాణకు రక్ష..”…

తెలంగాణ మాండలికానికి రారాణి

చెమ్మ : వారాల ఆనంద్ అకాడెమిక్, అకడమీషియన్ అనేమాటల నడుమ వున్న తేడా తెలియకుండానే రచయితలతో సహా చాలామంది పెద్దలు వాటిని ఒకే అర్థంలో వాడేస్తూ వుంటారు. నిజానికి అకాడెమిక్ అంటే  విశ్వవిద్యాలయ బోధన, పరిశోధన, విద్యారంగంతో సంబంధం ఉన్నవ్యక్తి. కాగా అకడమీషియన్ అంటే అధికారిక విద్యా/ శాస్త్ర అకాడమీకి సభ్యుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అనర్థం.…

శోకం

ఇంటిగుమ్మం దాటగానే గాలి విచిత్రమైన బరువుతో తాకింది. అది కేవలం గాలికాదు, పలకలేని మాటలతో నిండిన మూగ ఆర్తనాదం. అడుగులు ముందుకు వేయడానికి కూడా సంకోచం. ఆ ఇంట్లో ఎవరో ఉన్నారన్న అనుభూతి, కాదు ఎవరూ లేరన్న ఖాళీ మరింత స్పష్టంగా వినిపిస్తోంది. అది ఇప్పుడు ఒక ఇల్లు కాదు. అది ఒకప్పుడు జీవించిన జ్ఞాపకాల…

నిప్పుల వాన

ఒక్కొక్కరు అమరత్వం ముద్దాడి మళ్లీ చిరునవ్వులవుతున్నారు.   చూడు ఉషోదయ రెక్కల మీద చరిత రాసుకుంటున్న మానవజాతి పరిమళ కథలు.   వారు ఎప్పటికీ ఆకాశ నిండైన తారలు   కవిత్వానికి దొరకని భాషా నిఘంటువులు   తిరిగి తిరిగి చిగురిస్తున్న నిప్పుల వాన మొలకలు. -జనజ్వాల

హన్న!

మెరుపు తీగెలు బుజ్జిగాడు నిద్రలేచాడు. లేచాడు అంటే లేవలేదు. బెడ్‌‌మీద పడుకొనే వున్నాడు. కళ్ళు తెరిచి వున్నాయి. ఎదురుగా అమ్మ ముఖం, నవ్వుతూ. బుజ్జిగాడు నవ్వలేదు. ఆవలింత తియ్యలేదు. బద్దకంగా అటూయిటూ దొర్లలేదు. విప్పారిన కళ్ళతో చూశాడు. చూస్తూనేవున్నాడు. ‘ఏమిటమ్మా తల్లీ’ అని గోముగా నుదురుకు నుదురు ఆనించి ముక్కుకు ముక్కు రాస్తూ ముద్దు చేసింది…

మణిపూర్‌ను వెంటాడుతున్న భూమి, అస్తిత్వాల పోరాటం

“గత శతాబ్దపు తొంభైల కాలంలో నాగా, కుకీ సమాజాల మధ్య జరిగిన ఘర్షణలు వేలాది కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేశాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోగా, మరెందరో తమ నివాస ప్రాంతాలను విడిచి వెళ్లవలసి వచ్చింది. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా ప్రజల మనసుల్లో చెరిగిపోలేదు. ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు ఆ రక్తచరిత్ర మళ్లీ పునరావృతమవుతుందనే…

తెలంగాణ భూమిపుత్రులది, ఎవరి జాగీరూ కాదు!

“తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు” అని స్వయంగా పవన్ కళ్యాణ్ అన్న మాటను ఆయన పార్టీ నాయకులు అనేక మంది పునరుక్తం చేశారు. ఎవరి స్థాయిలో వారు, ఎవరి సంస్కారాన్ని బట్టి వారు బూతులు, తిట్లు, దుర్భాషలు జోడించారు. నాగేశ్వర్ ను వ్యక్తిగతంగా తూలనాడారు. సామాజిక మాధ్యమాలలో, యూట్యూబ్ ఛానళ్లలో నాగేశ్వర్ మీద,…