Prajatantra News 1

Prajatantra News 1

హైడ్రా దూకుడు మళ్లీ మొదలు

Illegal shutters in Alkapuri township

అల్కాపురి టౌన్‌షిప్‌లో అక్రమ షట్టర్లు నేలమట్టం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మణికొండ మున్సిపాలిటీలో దూకుడు పెంచింది. హైదరాబాద్‌ మణికొండలోని అల్కాపురి టౌన్‌షిప్‌లో హైడ్రా చర్యలు చేపట్టింది. మార్నింగ్‌ రాగా అపార్టుమెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా షట్టర్లు వేసి దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు షట్టర్లను తొలగించారు. దీంతో…

అమిత్‌ షా వ్యాఖ్యలపై దేశవ్యాప్త ఉద్యమం

కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, రాహుల్‌ ప్రకటన ప్రజలకు క్షమాపణలు చెప్పి, రాజీనామా చేయాలని డిమాండ్‌ న్యూదిల్లీ,డిసెంబర్‌19: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అవమానించారని, అందుకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున…

క్యాబినెట్‌ నుంచి అమిత్‌ షాను తొలగించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌19 : కేంద్ర క్యాబినెట్‌ నుంచి అమిత్‌ షాను తొలగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు. రాజ్యాంగ నిర్మాతను భాజపా అవమానిస్తే భారాస ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అంబేడ్కర్‌పై భాజపా వైఖరిని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదానీ వ్యవహారంలో భారాస వైఖరి ఏంటని ప్రశ్నించారు. అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై అట్రాసిటీ కేసు బుక్‌ చేయాలని అన్నారు. అంబేద్కర్‌పై బీజేపీ స్టాండ్‌ ఎంటో అమిత్‌ షా బయట పెట్టారని చెప్పారు. అసెంబ్లీ విూడియా పాయింట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు. అమిత్‌ షా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పందించాలన్నారు. స్వాతంత్య ఉద్యమంలో బీజేపీ పాత్రనే లేదని స్పష్టం చేశారు. స్వాతంత్య పోరాటం చేస్తుంటే బీజేపీ నేతలు బ్రిటిష్‌ వారికి తాబేదార్లుగా పని చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. అంబేద్కర్‌పై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. అమిత్‌ షా వ్యాఖ్యలు దేశ ప్రజల గుండెలను గాయపరిచిందని చెప్పారు.

హైదరాబాద్‌,డిసెంబర్‌19 :  కేంద్ర క్యాబినెట్‌ నుంచి అమిత్‌ షాను తొలగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు.   రాజ్యాంగ నిర్మాతను భాజపా అవమానిస్తే భారాస ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అంబేడ్కర్‌పై భాజపా వైఖరిని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌…

విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రం

ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 :  దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త ఆవిష్కరణలు శ్రీకారం చుడుతోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రాన్ని గురువారం మంత్రి జూపల్లి ప్రారంభించారు.…

అగ్రికల్చర్‌ వర్సిటీ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ఏర్పాట్లను పర్యవేక్షించిన  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, వేడుకల  ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర వ్యవసా య, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మహిళా రైతులు కూర్చోవ డానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. గురువారం ఉదయం…

అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలకు టిజెఎస్‌ ఆందోళన

ప్రజలకు అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 :  డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ టిజెఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా దిష్టిబొమ్మను దహనం చేసి,…

రా!

నోటికి తాళం వేసుకో నిత్యసత్యాలను కంధరం లో దాచుకో ఆకలి వేస్తున్న దాహం వేస్తున్న కడుపులో పైత్యరసం మంటలు రేపు తున్న నోరు మెదపకు ఆకలి తో కడుపు మాడ్చుకో చూడలేనివి భరించలేనివి కర్కశ రూపాలు కదను తొక్కుతున్న కంతలు కట్టిన గుర్రం లా ఉండిపో బలమైన బాహుల్ని ముడ్చుకుని జీ హుజూర్ అంటు కూర్చో…

ఈ పరి…

పిలవాలి ఏ లోతుల్లోంచో ఇంకా అరవాలి తలం దాటో అలసటతో తోపులాటలో వదిలేయాలి ముఖాలను కిందపడి రాలిపోయి బజారులో వాన నీటిలో తేలుతూ పోతుంటాయి పొలిమేరల వైపు పొలాలకు మొహాలు కోల్పోయి ప్రశ్నార్థక చిహ్నాలమై దేహాలతో ఆకారాలతో మాటలను బట్టి పోలుస్తూ అరచేతిని ఆడిస్తూ నుదుటిపై చెరిగిపోయిన రాకను వెతుక్కుంటాం! కొత్తవదనాలు కొలిమిలో తయారు చేయబడుతుంటాయి…

విలక్షణతను ప్రదర్శించిన కథలు…

ఎంతో లోతైన సమాజ అనుశీలనతో తాను రాసిన 21 కథలను నిర్వాణ సంపుటిగా ప్రముఖ కథా రచయిత రామచంద్రమౌళి వెలువరించారు. తన జీవితంతో పాటు తన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించి రాసిన కథలివి.  విస్తరించి ఉన్న సమాజంలో భిన్న మనస్తత్వాలు కలిగిన విభిన్న వ్యక్తుల జీవితాల్లోంచి పరిశీలనాత్మకంగా, పరిశోధనాత్మకంగా, అధ్యయనాత్మకంగా సాగిన…

నిద్ర…

నిద్ర ఒక అవ్యవస్థానురాగం కనురెప్పలు మూసినాంక మరో నిశిధి లోకం చేరుతాం సుఖవంత పరుపు,సౌకర్య నేల దీర్ఘ చీకటి, కటిక నిశ్శబ్దం నిదుర కు స్నేహితులు ఖరీదయిన దుస్తులు,బరువైన నగలు విలువైన సంపదలు నిద్ర కు శత్రువులు ఉదయపు పొగ మంచులా రాత్రి నిద్దుర సందడి చేస్తుంది గొప్పవారి గదులలో విహరించే ఖరీదయిన నిద్ర కు…