deccan.com

deccan.com

రాజకీయ పార్టీల పెత్తనానికి కళ్లెం వేయాలి!

 ప్రజాధనం వృధాను అరికట్టగలగాలి అన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా చట్టాలను మార్చు కుంటున్నారు. రాజకీయ సంస్కరణల విషయంలో అన్ని పార్టీలదీ ఒకటే దారి.  అన్నీ ఒకే తాను ముక్కలు గనక వాటి గురించి అంతా తలూపుతున్నారు. ఇప్పుడు జమిలి ఎన్నికల విషయంలో రాజీపడ్డట్లు కనిపించినా అందరికీ అవసరమే. కాకపోతే తరచూ ఎన్నికలను రాజకీయ పార్టీలు…

సరస్సులు, చెరువుల పునరుద్ధరణకు పూనుకోవాలి!

సరస్సులు, చెరువులకు కొత్త శోభ.. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చి ఏడాది పూర్తయ్యింది. అయితే ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు. మంత్రుల మధ్య సమన్వయం కనిపించడం లేదు. అలాగే ప్రతి విషయానికి దిల్లీ  నుంచి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి తప్పడం లేదు. అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవడం తప్పడం లేదు. హావిరీలపై విపక్షాలు నిలదీస్తున్నాయి. కాంగ్రెస్‌…

వ్యవసాయ రంగంలో సంస్కరణలు రావాలి!

కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి!  వ్యవసాయాభివృద్దికి తక్షణ చర్యలు అవసరం వ్యవసాయ చట్టాలు తీసుకుని వొచ్చినప్పుడు ప్రధాని మోదీ కనీసం ఏ ఒక్కరితోనూ చర్చించలేదు. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో దానిని వెనక్కు తీసుకున్నారు. అప్పుడు చట్టంలోని మంచిని గానీ చెడును గానీ పార్లమెంటులో కనీసంగా అయినా చర్చించలేదు. ఈ క్రమంలో  పంటలకు అందిస్తున్న కనీస…

జీవనశైలిలో మార్పులు అవసరం!

 కంటి నిండా నిద్ర కూడా ముఖ్యమే… దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనే మధుమేహ రోగుల సంఖ్య విషయంలో తెలంగాణ మూడోస్థానంలో నిలిచిందంటే ఆశ్చర్యం కలుగక మానదు.   మన రాష్ట్రంలో మూడు పదులు పైబడిన వారిలో 14 శాతం మంది షుగర్‌ పేషంట్స్‌ ఉన్నారని.. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంట్‌కు ఇచ్చిన…

సమానత్వానికి సమున్నత పీఠం!

స్వేచ్ఛకు పట్టం కట్టింది…  సమానత్వానికి సమున్నత పీఠం వేసింది..  సౌభ్రాతృత్వానికి బ్రహ్మరథం పట్టింది.  మన భారత రాజ్యాంగం. 389 సభ్యుల ఆలోచనల సమాహారంగా ప్రాణంపోసుకుంది. అందులో పదిహేనుమంది మహిళామణులు పాలుపంచుకోవడం మరపురాని ఘట్టం. వారి గురించి ఒక్కసారి.. కమలా చౌదరి:  భారత స్త్రీలు నిత్య జీవితంలో ఎదుర్కొనే అంశాలపై అనేక రచనలు చేశారు. భారత జాతీయ…

  పీ వీ గారికి నచ్చిన. అంబేడ్కర్ గారు మెచ్చిన ప్రముఖ మరాఠీ మేధావి ప్రహ్లాద్ కేశవ్ అత్రే

1950 దశకంలో బొంబయి నగరంతో కలసిన మహారాష్ట్రను కోరుతూ ఏర్పడ్డ సంయుక్త మహారాష్ట్ర సమితికి చెందిన అనేక నాయకులు అంబేడ్కర్ తో సాన్నిహిత్యం కలిగి ఉండేవారు. వారిలో శంకర్రావ్ మోరే, కేశవ్ సీతారాం ఠాక్రే, , పాండురంగ్ సదాశివ్ సానే, ఎస్.ఎం.జోషి, రామ్ మనోహర్ లోహియా తో బాటు ప్రహ్లాద్ కేశవ్ అత్రే కూడ ఉన్నారు.…

అక్రమ కేసులపై పోరాడుతాం: ఎమ్మెల్సీ మధుసూదనాచారి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని మండలిలో విపక్ష నేత, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. కేటీఆర్‌ మీద పెట్టిన అక్రమ కేసు తీవ్రంగా నిరసన తెలుపుతున్నామని, దానిపై సభలో చర్చించాలని డిమాండ్‌ చేశామన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు చేపట్టారని, కేటీఆర్‌ తన శక్తి…

అరుపులు, కేకలు, ఘాటైన విమర్శలు

ప్రజాతంత్ర డెస్క్‌ ,హైదరాబాద్‌: శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న ఆరవరోజు కూడా అదే ధోరణి. అధికార, విపక్షాల మధ్య ఘాటైన విమర్శలు, పరుష పదజాలాలు. ఫలితంగా సభను పలుసార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి. వాస్తవంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభ నుండి ఇదే ధోరణి కొనసాగుతున్నది. కాని, శుక్రవారం ఆరవరోజు అది పరాకాష్టకు చేరుకుంది. సభ ప్రారంభంలో…

ఈ కార్‌ రేసింగ్‌పై చర్చకు బిఆర్‌ఎస్‌ పట్టు

భూ భారతిపై చర్చను అడ్డుకునే యత్నం  నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్‌ రాష్ట్ర శాసనసభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బిజెపి ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం, తదితర పరిణామాలతో సభలో గందరగోళం ఏర్పడిరది. దీంతో స్పీకర్‌…

30 వరకు కేటీఆర్‌ ను అరెస్ట్‌ చేయొద్దు..

హైకోర్టులో కెటిఆర్‌కు స్వల్ప ఊరట  ఈ ఫార్ములా రేస్‌ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు  తదుపరి విచారణ 27కు వాయిదా హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 (ఆర్‌ఎన్‌ఎ) : బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు…