అగ్రికల్చర్‌ వర్సిటీ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ఏర్పాట్లను పర్యవేక్షించిన  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, వేడుకల  ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర వ్యవసా య, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మహిళా రైతులు కూర్చోవ డానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. గురువారం ఉదయం వ్యవసాయ కార్యదర్శి, ఏపీసీ ఎం.రఘునందన్‌ రావు , కమిషనర్‌ బి.గోపితో కలిసి మంత్రి రాజేంద్రనగర్‌ లోని పిఆర్టిఏయూ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, ఆడిటోరియంను పరిశీలించారు.

ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య, ఇతర ఉన్నతాధికారులు జరుగుతున్న ఏర్పాట్లను మంత్రికి వివరించారు. కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులకి ఉపయోగపడేలా, ఆవరణలో అనువైన ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. గవర్నర్‌, విశ్వవిద్యాలయ కులపతి జిష్ణు దేవ్‌ వర్మ, ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి, పర్యటన, ప్రసంగ కార్యక్రమాల్లో సమయపాలన పాటించాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page