పిలవాలి ఏ లోతుల్లోంచో
ఇంకా అరవాలి తలం దాటో
అలసటతో తోపులాటలో
వదిలేయాలి ముఖాలను
కిందపడి రాలిపోయి
బజారులో వాన నీటిలో
తేలుతూ పోతుంటాయి
పొలిమేరల వైపు పొలాలకు
మొహాలు కోల్పోయి
ప్రశ్నార్థక చిహ్నాలమై
దేహాలతో ఆకారాలతో
మాటలను బట్టి పోలుస్తూ
అరచేతిని ఆడిస్తూ నుదుటిపై
చెరిగిపోయిన రాకను వెతుక్కుంటాం!
కొత్తవదనాలు కొలిమిలో
తయారు చేయబడుతుంటాయి
వరుసకట్టుంటాం వీధుల్లో
సుత్తి దెబ్బలు పడి ఎర్రగా
నిప్పు కణికల మధ్య
ఆవిష్కరించబడుతుంటాయి
నిఖార్సైనవి… బండి చక్రానికి
ఇనుప వృత్తాన్ని తొడిగినట్టే
ఇమడ్చాలె..!
ఈ సారి పలకాలె కళ్ళు విప్పి..!!
– రఘు వగ్గు
ఈ పరి…
