నిద్ర ఒక అవ్యవస్థానురాగం
కనురెప్పలు మూసినాంక
మరో నిశిధి లోకం చేరుతాం
సుఖవంత పరుపు,సౌకర్య నేల
దీర్ఘ చీకటి, కటిక నిశ్శబ్దం
నిదుర కు స్నేహితులు
ఖరీదయిన దుస్తులు,బరువైన నగలు
విలువైన సంపదలు నిద్ర కు శత్రువులు
ఉదయపు పొగ మంచులా
రాత్రి నిద్దుర సందడి చేస్తుంది
గొప్పవారి గదులలో విహరించే
ఖరీదయిన నిద్ర కు కీచురాళ్ల పాటలుండవు
ధనవంతులను ఆదరించే నిద్ర
దరిద్రులను విస్మరించదు
నిద్ర కు లేవు బేధభావాలు
ఐ. చిదానందం
చరవాణి – 8801444335