deccan.com

deccan.com

జేపీసీకి జమిలి బిల్లు లోక్‌సభలో తీర్మానం ఆమోదం

న్యూదిల్లీ, డిసెంబర్‌ 20 : ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రూపొందిన జమిలి బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపాలని శుక్రవారం లోక్‌సభ తీర్మానం పాస్‌ చేసింది. సభను నిరవధికంగా వాయిదా వేయడానికి ముందు రెండు బిల్లులను జేపీసీకి పంపేందుకు తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే రెండు రోజుల క్రితం…

కొత్త చట్టాలను స్వాగతించాల్సిందే….!

 పాత, కొత్త చట్టాలపై సమగ్ర అవగాహన అవసరం దేశానికి అనుగుణంగా చట్టాల రూపకల్పన జరగాలి కనుమరుగు కానున్నభారత సాక్ష్యాధార చట్టం పాలకులు వారి అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటున్న చట్టాలను కూడా చర్చించాలి. చట్టం ఎవరికైనా ఒక్కటే అన్న భావన ప్రజల్లో రావాలి. రాజకీయ నాయకులు చట్టాల నుంచి తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసు కోవాలి. బాధితులకు…

వేగానికున్న ప్రాధాన్యత భద్రతకు ఏదీ?

riding bikes and don't need helmets

చిన్నపాటి నిర్లక్ష్యమే భారీ మూల్యానికి  కారణం బైక్‌ నడపడంలో తాము నేర్పరులమని, హెల్మెట్‌ అవసరం లేదని, ఇది శిరోభారమని భావించేవారు మనలో చాలా మందే ఉన్నారు. హెల్మెట్‌ భారం కాదు అది ఒక రక్షణ కవచం. యువత బైక్‌ ఎక్కితే చాలు రయ్‌ రయ్‌ మని దూసుకుపోతుంటారు. మితివిూరిన వేగం, మద్యం మత్తులో నడపడం, ట్రాఫిక్‌…

వెనుకబడిన వర్గాల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు

దేశమంతా సమగ్ర కులగణన చేపట్టని  పార్టీ నుంచి  వెనుకబడిన కులాల ప్రతినిధి ఆర్‌ క్రిష్ణయ్య  పెద్దల సభకు  పంపారు. మొన్నటి వరకు వైసీపీలో ఎంపీలు గా వెలగబెట్టిన  ఆర్‌ క్రిష్ణయ్య, బీద మస్తాన్‌ రావు, మోపిదేవి వెంకటరమణ  ఇప్పుడు కండువా మార్చి తెలుగుదేశం బీజేపీ పంచన చేరి   ప్రాతినిధ్యం వహిస్తున్నారు.   ఏటా  రెండు…

ప్రశ్నార్ధకంగా పక్షుల మనగడ!

నేడు నగర వాతావరణంలో పక్షుల మనగడ కష్టమవుతోంది. ప్రశ్నార్ధకంగానూ మారుతోంది. ఇప్పటికే అనేక రకాల పక్షులు నగరాల్లో కనుమరుగయ్యాయి. అయితే పావురాలకు మాత్రం ఇది వర్తించదు. పల్లె ప్రాంతాల్లో కన్నా నగరా ల్లోనే మనం పావురాలను ఎక్కువగా చూస్తాం. సిటీస్‌లో వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంటాయి. వాటిని చంపితినే జంతువులు దాదాపు ఉండవు. ఉన్నా చాలా తక్కువ. వీటికి తోడు ఎత్తయిన బిల్డింగులు, కిటికీలు, పైకప్పులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, గోదాములు..ఇలా ఒకటేంటి, అవి నివసించడానికి ఎన్నో అనువైన ప్రదేశాలున్నాయి. అయితే, మెట్రో సిటీస్‌లో వీటి సంఖ్య పెరగటం మనుషులకు ప్రమాదంగా పరిణమిస్తోంది. పావురాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌, వాటిని పోషించే వారిపై చర్యలు ప్రారంభించింది. పావురాల రెట్టలు, ఈకలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వీటితోపాటు చర్మ సమస్యలు, అలర్జీలు, సైనసైటిస్‌ ప్రమాదం పెరుగుతుంది. కానీ, ఏదైనా ఒక జీవి జనాభా విపరీతంగా పెరిగితే అది పర్యావరణంపైనా ప్రభావం చూపుతుంది. పావురాల సంఖ్య పెరగడం పర్యావరణంలో అసమ తుల్యతకు సంకేతం. పావురాలు స్థానిక జాతులే. ఇళ్లలో పెంచుకోవడానికి పావురాలను మనుషులు అడవుల నుంచి గ్రామాలు, పట్టణాలకు తీసుకొచ్చారు. అంతకు ముందు అవి కొండా కోనల్లో తిరుగుతూ, పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య గూళ్లు పెట్టుకుని జీవించేవి. చిన్న చిన్న పురుగులు, పండ్లు తిని బతికేవి. వీటి రెట్టల ద్వారా పండ్ల విత్తనాలు అడవి అంతటా వ్యాపించేవి. కానీ, ఇప్పుడు పక్షులకు అడవులలో తిండి సరిగా దొరకడం లేదు. పావురాలను డేగలు, గద్దలు వేటాడి చంపి తింటుంటాయి. తోడేళ్లు, నక్కలకు కూడా ఇవి చాలా ఇష్టమైన ఆహారం. తరచూ మనుషులు కూడా వీటిని వేటాడుతుంటారు. ఇంతకు ముందు ఈ పక్షులు అడవుల్లో చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా తగ్గాయి. నగరాల్లో వీటికి శత్రువులు పెద్దగా లేకపోవడం, రక్షణ ఎక్కువగా ఉండటం వాటి సంఖ్య పెరగడానికి కారణమైంది. పైగా ప్రజలు వాటికి తిండిగింజలు వేస్తూ వేటాడే శ్రమను తగ్గిస్తున్నారు. దీంతో సహజంగానే సంతానోత్పత్తి సులభమవుతోంది. పౌల్ట్రీలలో కోళ్లు పెరిగినట్లే, ఇక్కడ పావురాలు కూడా పెరుగుతున్నాయి. నగరాలు పెద్ద పౌల్ట్రీ ఫామ్ గా మారాయి. పావురాల సంఖ్య పెరిగేకొద్దీ ప్రకృతిలోని ఇతర జీవులపై దాని ప్రభావం పడుతుంది. ఇవి తమకంటే చిన్నసైజులో ఉండే పిచ్చుకల్లాంటి వాటిని వేధిస్తుంటాయి. అవి కట్టుకున్న గూళ్లను ఆక్రమిస్తుంటాయి. వాటి ఆహారాన్ని తినేస్తాయి. దీనివల్ల ఆహారపు కొరతతో చిన్నపక్షులు నశిస్తుంటాయి. ఒక్క పావురానిదే కాదు, ఏ పక్షి మల మూత్రాలైనా మన చుట్టూ ఎక్కువగా ఉంటే, అవి మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇక, పర్యావరణంలో పావురాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అవి పెద్ద సంఖ్యలో పెరగడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఏ ప్రదేశంలో ఎన్ని పక్షులు నివసించాలి అన్నదానిపై ఒక నిర్దిష్ట పరిమితి ఉంది. ఒక రకం జీవరాశి అధికంగా పెరిగితే, దానివల్ల ఇతర జీవులకు లభించే ఆహారం, నివాసం, ఎగిరే స్థలం తగ్గుతాయి. అది వాటి జనాభా విూద ప్రభావం చూపిస్తుంది. పావురాలు అన్ని పరిస్థితులను తట్టుకుంటాయి. కొన్ని ఇతర పక్షుల మాదిరిగా కాకుండా, ఏ సమయంలోనైనా గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేయగలవు. నివాసానికి అనుకూల స్థలం, పుష్కలంగా ఆహారం, వేటాడే జంతువులు లేకపోవడంలాంటివి పావురాలు విపరీతంగా పెరగడానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు నగరాలలో చాలా ప్రాంతాలను పావురాలు ఆక్రమించినట్లు కనిపిస్తుంది. వీటి కారణంగానే కాకులు, పిచ్చుకల్లాంటి కొన్ని పక్షులు కనిపించకుండా పోతున్నాయి. అయితే పావురాల సంఖ్య పెరగడం వల్లే ఇతర పక్షుల తగ్గిపోతున్నాయని చెప్పడం పూర్తిగా నిజంకాకపోవొచ్చు. పట్టణీకరణతోపాటు, మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా ఇలాంటి పక్షులు కనుమరుగవుతున్నాయి. ఈ రెండింటిలో ఏది ఎంత వరకు కారణమన్నదాన్ని పరిశోధించాల్సి ఉంది. -మహేందర్ మిట్టపల్లి

నేడు నగర వాతావరణంలో పక్షుల మనగడ కష్టమవుతోంది. ప్రశ్నార్ధకంగానూ మారుతోంది.  ఇప్పటికే అనేక రకాల పక్షులు నగరాల్లో కనుమరుగయ్యాయి. అయితే  పావురాలకు మాత్రం ఇది వర్తించదు. పల్లె ప్రాంతాల్లో కన్నా నగరా ల్లోనే మనం పావురాలను ఎక్కువగా చూస్తాం. సిటీస్‌లో వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంటాయి. వాటిని చంపితినే జంతువులు దాదాపు ఉండవు. ఉన్నా…

శాసన సభ,శాసన మండలి …డిసెంబర్‌ 19

భూ భారతి చట్టం ప్రకటనపై బీఆర్‌ఎస్‌ నోటీసులు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో భూ భారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్‌ పేజీ ప్రకటనలు గుప్పించింది. దీనిపై బీఆర్‌ఎస్‌ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. శాసనసభ హక్కులను రక్షించాలని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను…

రెండేళ్లలో ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ పూర్తి

Minister Uttam Kumar Reddy

సవరించిన అంచనాల మేరకు 4,650 కోట్ల కేటాయింపు 700 మంది ఏఈఈల నియామకం మరో 1238 ఉద్యోగాలను భర్తీ చేస్తాం.. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ప్రతిబంధకంగా  భూసేకరణ భూసేకరణలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి శాసన సభలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 :  వొచ్చే ఐదేళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు…

ఐదేళ్లలో కొత్తగా 30 లక్షల ఆయకట్టుకు నీరు

సంక్రాంతి తర్వాత అర్హులందరికీ తెల్ల రేషన్‌ కార్డులు రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురిపై పిడి యాక్ట్‌ శాసనసభలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 :  పిడిఎస్‌ బియ్యన్ని అక్రమంగా విక్రయిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌…

లక్షల కోట్ల అప్పులు దుబారా చేశారు..

 బిఆర్‌ఎస్‌ అప్పులు తీర్చలేక చస్తున్నాం.. 40 వేల కోట్ల పెండిరగ్‌ బిల్లులు పెట్టిపోయారు.. ప్ర్రజకు తెలియాలనే ‘రాష్ట్ర రుణాలు- స్వల్ప వ్యవధి’ చర్చ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా చూపడం వారికి వెన్నతో పెట్టిన విద్య అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19:  గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి…

బీజేపీ ఎంపీలు తోయడం వల్లే కిందపడిపోయా

కాంగ్రెస్‌ ఎంపీ మల్లిఖార్జున్‌ఖర్గే న్యూదిల్లీ,డిసెంబర్‌ 19 : బీజేపీ ఎంపీలు నెట్టివేయడం వల్ల.. తాను కూడా కింద కూలినట్లు కాంగ్రెస్‌ ఎంపీ, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున్‌ ఖర్గే ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. బీజేపీ ఎంపీలు మకర ద్వారం వద్ద తనపై భౌతిక దాడి చేసినట్లు ఆరోపించారు.…