– ఇది కుల సమస్య కాదని గుర్తించాలన్న గంగుల
హైదరాబాద్,ప్రజాతంత్ర,మే13: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ విషయంలో బీఆర్‌ఎస్ భాధితురాలి పక్షాన ఉందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ నేతల ఒత్తిడితోనే కేంద్ర మంత్రి కొడుకుపై కేసు నమోదు చేశారన్నారు. బండి సంజయ్ కొడుకు పోక్సో కేసును కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కుల సమస్య కాదు. లా అండ్ ఆర్డర్ సమస్య. నిన్న కరీంనగర్ లో బెదిరింపు ధోరణిలో మాట్లాడిన బండి సంజయ్ ఎవరి అంతు చూస్తావ్..? బాధితురాలిని అంతం చేస్తావా, లేకపోతే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను అంతం చేస్తావా..అని గంగుల ప్రశ్నించారు. చట్టానికి, పోలీసులకు బండి సంజయ్ కుమారుడు సహకరించాలన్నారు. కాగా బండి సాయి భగీరథ్‌పై ఇప్పటికే పోక్సో కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాజాగా కొన్ని సెక్షన్లను అదనంగా చేర్చారు. పోక్సో చట్టం సెక్షన్ 5(1) రెడ్ విత్ 6ను జత చేశారని తెలిసిందే. ఇంతకుముందు బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో చట్టం, బీఎన్‌ఎస్ 74, 75 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును మహిళా ఐపీఎస్ అధికారి రితిరాజ్‌కు అప్పగించిన నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



