మిల్లర్ల నుండి బకాయిలు వసూలు చేయాల్సిందే

– సివిల్ సప్లయిస్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుండి బకాయిలను వసూలు చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సివిల్ సప్లయిస్ విభాగంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి బుధవారం సమీక్ష నిర్వహించారు. బకాయిల వసూలుకు ఒక విధానాన్ని రూపొందించాలన్నారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని, బకాయిల వసూలే ప్రధాన లక్ష్యంగా చర్యలు ఉండాలని అన్నారు. మిల్లర్ల బ్లాక్ మెయిల్‌ను సహించనని సీఎం హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయి బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను స్వాధీనం చేసుకుని మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. మార్కెట్‌లో ఉన్న గోడౌన్‌లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, అవసరమైతే మిల్లింగ్ బాధ్యతల్ని మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగిస్తాని అన్నారు. ఐదు నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు 50 నుంచి 100 ఎకరాల్లో గోడౌన్‌ల నిర్మాణం కోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టాలన్నారు. ధాన్యం ఎక్కువ దిగుబడి అయ్యే ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయాలని, గోడౌన్‌ల నిర్మాణంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవాలని, ప్రతి జిల్లాకు నోడల్ అధికారిని నియమించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమీక్షా సమావేశంలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ క‌మిష‌న‌ర్‌ స్టీఫెన్ రవీంద్ర, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

IIIIIIIIII

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *