హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతిచెందడం పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వన్యప్రాణులను కాపాడేందుకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నవీన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలు, ఉచ్చులు ఏర్పాటు చేయడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల జంతువులతోపాటు అటవీ సిబ్బంది, స్థానిక ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వన్యప్రాణుల వేటకు పాల్పడవద్దని, ప్రాణాంతకమైన విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేయవద్దని మంత్రి సీతక్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




