– పొగాకు ఉత్పత్తుల నిషేధం అమలుపై రాష్ట్రపతి భవన్ ఆరా
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: విద్యాసంస్థలు, కళాశాల ల వద్ద సిగరెట్ పొగాకు ఉత్పత్తుల నిషేధం కోసం తాము ఉత్తర్వులు ఇచ్చాం.. అవి అమలు అవుతున్నాయా అంటూ రాష్ట్రపతి భవన్ అధికారులు తనకు ఫోన్ చేసినట్లు పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్సుమెంట్ డిప్యూటీ తహసిల్దార్ మాచన రఘునందన్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన సోమవారం మాట్లాడుతూ వద్యార్ధులు, యువత తెలిసో తెలియకో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులకు ఆకర్షితులై ఆనక అలవాటుగా మార్చుకుంటున్నారని, వారి తల్లి దండ్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సహాయంగా ఉండి పోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి భవన్ కు ఇటీవల లేఖ రాసినట్లు వివరించారు. మేడం.. దయచేసి స్కూళ్లు, కాలేజీల వద్దనైనా సిగరెట్ లను నిషేధించాలని అభ్యర్థించారు. దీంతో రాష్ట్రపతి భవన్ అధికార వర్గాలు స్పందించాయి. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాల వద్ద సిగరెట్ ల విక్రయాలను నిషేధించాలని, ఈ మేరకు రాష్ట ప్రభుత్వాలు చిత్త శుద్ధితో చట్టాలు అమలు చేయాలని సూచిస్తూ ఆయా రాష్ట్రాలకు అధికారులు ఉత్తర్వులు పంపారు. ఈ క్రమంలోనే రఘునందన్ కు సైతం ఉత్తర్వుల ప్రతిని పంపారు. అయితే ఆ ఉత్తర్వులు ఆశించిన స్థాయిలో అమలు అవుతున్నాయా లేదా అంటూ సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్ వర్గాలు ఫోన్ చేసి అడిగినట్టు రఘునందన్ వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





