– ల్యాప్ టాప్ అందజేత
– కళాశాల ఫీజు సైతం చెల్లిస్తా అని హామీ
– కేటీఆర్ కు విద్యార్థి అభినవ్, తల్లిదండ్రుల కృతజ్ఞతలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు.గిఫ్ట్ ఏ స్మెల్ ద్వారా విద్యార్థులకు తన వంతుగా సహాయ, సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. సోమవారం ఐఐటీ లో వారణాసి లో సీటు సాధించిన సిరిసిల్ల కు చెందిన గడ దాస్ అభినవ్ తన తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ,శ్రీలత లతో కలిసి హైదరాబాద్ లో కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.నేత కుటుంబానికి చెందిన అభినవ్ ను ఐఐటి లో సీటు సాధించడంతో కేటీఆర్ శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థికి ల్యాప్టాప్ ను గిఫ్ట్ స్మైల్ కింద అందజేశారు. కళాశాల ఫీజు కూడా తాను చెల్లిస్తానని భరోసా ఇచ్చి, చక్కగా చదువుకొని , తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని , ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు విద్యార్థి అభినవ్, తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ శ్రీలతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





