– సిగాచిలో 60 మంది చనిపోతే దిక్కులేకుండా పోయింది
– 120మంది ఆటో డైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు
– బీఆరఎస్Ÿ హయాంలో కార్మిక సంక్షేమాన్ని అమలు చేశాం
– మరో రెండేళ్లు ఆగితే మళ్లీ అధికారం బీఆర్ఎస్‌దే
– మేడే ఉత్సవాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సరైన పని దినాలు, వసతులు కల్పించక ఇబ్బందులపాలు చేస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆరఎస్ జెండాను ఎగురవేసి మేడే శుభాకాంక్షలు తెలిపారు. సఫాsTÖల శ్రమను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తించడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక సర్కార్ నడుస్తోందని, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కాంగ్రెస్ బాధితులయ్యారని తెలిపారు. మంత్రుల జీతాల్లో కోత పెట్టి ఇస్తామనడానికి వాళ్లు వరద బాధితులా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 120 మంది ఆటో డైవర్లు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రెండేళ్లు భరించండి.. కేసీఆర్ వచ్చి కార్మికులకు మేలు చేస్తారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు చేతినిండా పని కల్పించి ఆదుకున్నదని, నగరంలో రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. కోవిడ్ సమయంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు కార్మికులకు ఉచిత రైళ్లను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి, అసమర్ధత వల్ల ఎసఎల్‌బీసీ కుప్పకూలిపోగా చనిపోయిన కార్మికులను అప్పగించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా సిగాచీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి 60మంది సజీవదహనం అయితే పట్టించుకున్న నాథులే లేరని దుయ్యబట్టారు. రూ.కోటి నష్ట పరిహారం ఇస్తామని రేవంత్ హావిÖ ఇచ్చి ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. నగరంలో వలస వచ్చి నివాసమేర్పచుకున్న కార్మికుల ఇళ్లను హైడ్రా పేరిట కూల్చి రోడ్డుపాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు మాత్రమే జరుగుతున్నవని తెలిపారు. ఎన్నికల ముందు దాన, వీర, శూర కర్ణ. ఎన్నికల తరువాత కుంభకర్ణ పాత్రను పోషిస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ అంటే ప్రేమ ఉంది కాబట్టే లాక్‌డౌన్ సమయంలో రోడ్లు, వంతెనలు నిర్మించామన్నారు. దేశ చరిత్రలో ఎన్నడు పెంచనంతగా వాణిజ్య సిలిండర్ల విÖద రూ.993 పెంచిన ఘనత కేంద్రంలోని నరేంద్ర మోదీ దేనని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలు అయిపోగానే గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడం మోదీకి అలవాటేనని అన్నారు. ఒక్క సిలిండర్ విÖద దాదాపు రూ.1000 పెంచి సామాన్యులకు, హోటళ్లలో పని చేసే కార్మికులకు మోదీ మేడే కానుక ఇచ్చాడని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో నిన్నటి వరకు ఒక సిలిండర్ ధర రూ.2,321లు ఉంటే అది నేడు రూ.3,315 పెరిగిందని తెలిపారు. హోటళ్లు, మెస్‌ల విÖద ఆధారపడి చదువుకునే యువతకు, ఉద్యోగాలు చేసుకునే వారికి ఈ ధరల పెంపుతో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




