క్రైమ్‌లో తెలంగాణ రైజింగ్

– వెల్‌డన్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధిక కేసులు కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆరోపించారు. తెలంగాణ మహిళలపై నేరాల రేటులో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిందని, సైబర్ నేరాలు కూడా భారీగానే పెరిగాయని విమర్శించారు. ఈమేరకు ‘ఎక్స్‌’ వేదికగా కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రుల్లోకెల్లా అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వెల్‌డన్ రాహుల్ గాంధీ.. నిజంగానే తెలంగాణ రైజింగ్ అంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యంగ్యంగా అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *