వీబీజీ రామ్‌జీలో ఆల్‌టైమ్ రికార్డు

– ఒకే రోజు ఐదు లక్షలకుపైగా కూలీలకు ఉపాధి
– ఉపాధి హామీ చరిత్రలో ఇదే తొలిసారి
– ఇదే స్ఫూర్తితో మరిన్ని పని దినాలు కల్పించాలి : మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : వీబీజీ రామ్‌జీ పథకం అమలులో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈనెల 3న(మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షలమందికి పైగా కూలీలకు ఒకే రోజు ఉపాధి కల్పించడం విశేషం. ఈ స్థాయిలో ఒకే రోజున కూలీలకు పని కల్పించడం ఇదే తొలిసారి. ఈ రికార్డును కొనసాగిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని పని దినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టే పనులు, నీటి వనరుల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతం వంటి పనులను చేపట్టాలని స్పష్టం చేశారు. కూలీలకు ఉపాధి కల్పించడం, నీటి వనరులను సంరక్షించడం, గ్రామాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే శాశ్వత ఆస్తులను సృష్టించడం అనే మూడు లక్ష్యాలతో ఉపాధి హామీ పనులు కొనసాగాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రతి గ్రామంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి కూలీలకు నిరంతరం పని లభించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఉపాధి కల్పనతో గ్రామీణ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించడంతోపాటు గ్రామాల అభివృద్ధికి కూడా దోహదపడేలా పనుల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *