డ్రగ్స్ ర‌హిత స‌మాజమే ల‌క్ష్యం

– వ‌రంగ‌ల్‌లో సంఘ‌మిత్ర కార్య‌క్ర‌మం
– ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో పోలీసు శాఖ నిర్వ‌హ‌ణ‌
– వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఎన్,శ్వేత

వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 5: ఎస్‌హెచ్‌జీ, వాలంటీర్స్, మెప్మా సభ్యుల ద్వారా 1.17 లక్షల మంది సభ్యులకు డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన డ్రగ్స్‌, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువత, మహిళలు, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సంఘమిత్ర కార్యక్రమాన్ని హన్మకొండలోని కాళోజి కళా క్షేత్రంలో శనివారం ఏర్పాటు చేశారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపులు 1,000 మెప్మా సభ్యుల ద్వారా 1.17 లక్షల మంది సభ్యులకు డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన కల్పిస్తూ వారి ద్వారా జిల్లాలోని ప్రతి కుటుంబానికి డ్రగ్స్‌ వ్యతిరేక సందేశాన్ని చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. వరంగల్ లోసంఘమిత్ర కార్యక్రమం ద్వారా డ్రగ్స్‌ అంశంపై ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేసేందుకు చర్యలు చేపడుతున్నామ‌ని వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఎన్,శ్వేత ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఎస్‌హెచ్ జీ, వీఓఏ సంఘాల్లోని ప్రతి సభ్యురాలు ఈ కార్యక్రమంలో భాగస్వామిగా నిలిచి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతి అంశంపై అవగాహన సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామ‌న్నారు.  పోలీసులు–ప్రజల భాగస్వామ్యంతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, వరంగల్ జిల్లాను మరింత సురక్షితమైన జిల్లాగా తీర్చిదిద్దడంలో సంఘమిత్ర ఒక బలమైన వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. “జనగామ జిల్లాలో మొదటిసారిగా ‘సంఘమిత్ర’ కార్యక్రమం నిర్వహించామ‌ని తెలిపారు. ప్రతి తల్లి బాధ్యత తీసుకుంటే గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలన తప్పకుండా సాధ్యమవుతుంది.డ్రగ్స్‌, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయం, సరఫరాకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసిన వెంటనే పోలీస్ శాఖకు తెలియజేయాల‌ని కోరారు.  సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం. విలువైన సమాచారం అందించిన వారికి తగిన రివార్డు కూడా అందజేస్తామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వ‌రంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద  మాట్లాడుతూ “డ్రగ్స్‌ సమస్య కేవలం పోలీస్ శాఖకు సంబంధించిన అంశం కాదు. ఇది మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య. అందరం కలిసికట్టుగా దీనిని ఎదుర్కోవాలి.యువతను సన్మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులు, కుటుంబాలు, విద్యాసంస్థలు, గ్రామ సమైక్య సంఘాలు కీలక పాత్ర పోషించాలి.ప్రతి కుటుంబంలో డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలి. యువతను మంచి మార్గంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల‌న్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ  “సంఘమిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఎస్‌హెచ్‌జి సభ్యుడు తన గ్రామంలో డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన కల్పిస్తూ ఒక సైనికుడిగా పనిచేయాలి.ప్రతి కుటుంబంతో మాట్లాడి డ్రగ్స్‌, గంజాయి వల్ల కలిగే ప్రమాదాలను వివరించాలి. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారికి సరైన మార్గదర్శనం చేయాలి.డ్రగ్స్‌ విక్రయం, సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలి. ప్రజల సహకారంతో డ్రగ్స్‌ నిర్మూలనకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, అడిషనల్ కలెక్టర్ వై.వి.గణేష్, పిడి డిఆర్డీఓ నాగ పద్మజ, జిల్లా వైద్యాధికారి రాజిరెడ్డి, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, మామూనూర్ ఏసీపీ వెంకటేష్, గీసుగొండ ఇన్స్ స్పెక్టర్ విశ్వేశ్వర్, సైకియాట్రిస్ట్ డాక్టర్ భరత్, జిల్లా సమైక్య సంఘం అధ్యక్షురాలు రజిత, టిఎల్ ఎఫ్ అధ్యక్షురాలు పద్మ, వివిధ మహిళ సంఘాల సభ్యులు, ఎస్ ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *