రాష్ట్రానికి రైల్వే మంత్రిత్వ శాఖ‌ వరం

రూ.10‌వేల కోట్లతో రైల్వే కారిడార్లు
దేశవ్యాప్తంగా రైల్వే మల్టీ ట్రాకింగ్‌ ‌
ఘట్‌కేసర్‌-‌కాజీపేట మధ్య నాలుగో లైన్‌ ‌
కేంద్ర కేబినెట్‌ ‌కీలక నిర్ణయాలు
మీడియాకు వెల్లడించిన అశ్విని వైష్ణవ్‌ ‌

న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 9 : ‌రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని రద్దీ మార్గాలతో సహా దేశవ్యాప్తంగా పలు మల్టీ ట్రాకింగ్‌ ‌రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ‌బుధవారం మీడియాకు వెల్లడించారు. కేబినెట్‌ ‌నిర్ణయం ప్రకారం తెలంగాణలోని ఘట్‌కేసర్‌-‌కాజీపేట సెక్షన్‌లో నాలుగో లైను నిర్మాణానికి ఆమోదం లభించింది. 110 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకు రూ. 2,419 కోట్లు అవుతుందని అంచనా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ‌మీదుగా సాగే అరక్కోణం-రేణిగుంట మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల పూర్తితో ఆయా మార్గాల్లో రైళ్ల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. నాలుగు రాష్ట్రాల్లోని 17 జిల్లాల పరిధిలో నాలుగు లైన్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10,021 కోట్లుగా కేంద్రం పేర్కొంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ‌తమిళనాడు, కర్ణాటక పరిధిలో ఐదు మల్టీ ట్రాకింగ్‌ ‌ప్రాజెక్టులు రాబోతున్నాయి. కొత్త లైన్ల నిర్మాణం ద్వారా రైల్వే నెట్‌వర్క్ ‌సామర్థ్యం పెరగడమే కాకుండా, సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల వేగం కూడా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిని 2029-30 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక వేసింది. బుల్లెట్‌ ‌రైలు ప్రారంభోత్సవం 2027లో జరగనుంది. దీని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. పనులు డిసెంబర్‌ ‌నాటికి పూర్తవుతాయి. వచ్చే ఏడాది మే-జూన్‌ ‌నాటికి టెస్టింగ్ కోసం రైలు పట్టాలపైకి వస్తుంది. టెస్టింగ్‌ ‌పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవం జరుగుతుందని అన్నారు. ఇందులో, అరక్కోణం- రేణిగుంట సెక్షన్‌లో 77 కి.మీ.పొడవుతో 3, 4 లేన్ల నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, ఘట్‌కేసర్‌- ‌కాజీపేట మధ్య 110 కి.మీ. పొడవుతో నాలుగో లేన్‌ ‌నిర్మాణానికి రూ.2,419 కోట్లతో ఆమోదం లభించింది. దీంతో పాటు వైట్‌ఫీల్డ్-‌బంగారుపేట మధ్య 47 కిలోమీటర్ల పొడవుతో 3, 4 లైన్ల నిర్మాణం, 159 కిలోమీటర్ల మేర సేలం-కరూర్‌-‌దుండిగల్‌ ‌డబ్లింగ్‌, 147 ‌కిలోమీటర్ల మేర హోసూర్‌-ఒమలూరు డబ్లింగ్‌కు ఆమోదం లభించింది.ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరిగి, రద్దీ తగ్గునున్నట్లు ప్రభుత్వం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రముఖ పర్యటక ప్రదేశాలకు రైలు మార్గాలు మెరుగుపడనున్నట్లు తెలిపింది. తారాతరిణి ఆలయం, జగన్నాథ ఆలయం(ఝార్సుగూడ సమీపంలోని పురాతన ఆలయం), బంధవ్‌గఢ్‌ ‌టైగర్‌ ‌రిజర్వ్, అమర్‌కంటక్‌ ఆలయం, అచానక్‌మార్‌ ‌టైగర్‌ ‌రిజర్వ్ ‌వంటి ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలకు రైలు కనెక్టివిటీ పెరుగుతుందని అంచనా వేసింది. దీంతో పాటు సరుకు రవాణాకు కూడా ఈ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా బొగ్గు, సిమెంట్‌, ఇనుము, ఉక్కు వంటి సరుకుల రవాణా సులుభతరం కానుంది. దీనివల్ల ఏడాదికి అదనంగా సుమారు 47 మిలియన్‌ ‌టన్నుల సరుకు రవాణాకు మార్గం సులభతరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. సమగ్ర ప్రణాళిక, భాగస్వాముల సంప్రదింపుల ద్వారా బహుళ- రవాణా అనుసంధానాన్ని, లాజిస్టిక్‌ ‌సామర్థ్యాన్ని పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పీఎం గతి శక్తి నేషనల్‌ ‌మాస్టర్‌ ‌ప్లాన్‌ ఆధారంగా ఈ ప్రాజెక్టులు ప్రణాళిక రచించారు. ఈ ప్రాజెక్టులు ప్రజలు, వస్తువులు, సేవల రవాణాకు నిరంతరాయ అనుసంధానాన్ని అందిస్తాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. రైల్వే నెట్‌వర్క్ ‌పెరగడం వల్ల దేశంలో చమురు దిగుమతులు తగ్గుతాయని అభిప్రాయపడింది. దాదాపు 12 కోట్ల లీటర్ల చమురు దిగుమతి ఆదా అవుతుందని తెలిపింది. అలాగే, 62 కోట్ల కిలోల కార్బన్‌ ‌డయాక్సైడ్‌ ఉద్గారాలు తగ్గుతాయని పేర్కొంది.

 ఘట్ కేసర్ – కాజీపేట మధ్య 110 కి.మీ. పొడవున నాలుగో లైన్ 

కాజీపేట‌/హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : తెలంగాణలోని అత్యంత కీలకమైన ఘట్ కేసర్ -కాజీపేట సెక్షన్ మధ్య 110 కిలోమీటర్ల పొడవునా నాలుగో రైల్వే లైన్ నిర్మా ణానికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు అంచనా విలువను రూ.2,419 కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. సికింద్రాబాద్-కాజీపేట మార్గంలో రైళ్ల రద్దీ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ నాలుగో లైన్ అందుబాటులోకి వస్తే సరకు రవాణాతోపాటు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం, సమయపాలన మెరుగుపడనుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *