“మాయిస్టులతో చర్చలు జరపడంలో కీలకంగ పాత్ర పోషించారు. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ముఖ్యంగా దిల్లీ చుట్టుపక్కల ఉండే క్వారీల్లో కార్మికుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. హత్యానేరం ఆరోపణల్లో 14 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు. 2011వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అగ్నివేష్ కూడా పాలు పంచు కున్నారు. కొందరు నిరసన కారులు తన మీద వ్యక్తిగత, రాజకీయ ఎజెండాలతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆందోళనల నుంచి విరమించు కున్నారు. 2011 సంవత్సరంలోనే మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఐదుగురు ఛత్తీస్‌గఢ్ పోలీసులను విడిపించడంలో మావోయిస్టులతో జరిపిన బృందంలో అగ్నివేష్ కూడా ఒకరు.”
రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్…మొబైల్:9440595494
ఆర్య సమాజ్ నేత, సామాజిక ఉద్యమ కారుడు స్వామి అగ్నివేశ్ (80) తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా జరిగిన అనేక సామాజిక ఉద్యమాలకు, పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచారు. స్వామి అగ్నివేశ్ భ్రూణహత్యలు, వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై, సామాజిక అంతరాలపై గొంతెత్తారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు సంపూర్ణ మద్దతు తెలపడమే కాకుండా, ఉద్యమ కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొని, ఉద్యమ కారులను బలం చేకూర్చారు. 1939 సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళంలోని సనాతన బ్రాహ్మణ కుటుంబంలో 1939 సెప్టెంబర్ 21న జన్మించారు. ఆయన అసలు పేరు వేపా శ్యాంరావు. నాలుగేళ్లకే తండ్రి మరణించడంతో అనంతరం ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న శక్తి అనే రాజ్యంలో దివాన్ అయిన తన తాత వారింట పెరిగారు. కోల్‌కతా లోని సెయింట్ గ్లేవియర్ కాలేజీ న్యాయశాస్త్రం, వాణిజ్యంలో డిగ్రీలు సంపాదించారు. కోల్‌కతా లోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. సభ్యసాచి ముఖర్జీ అనే ప్రఖ్యాత న్యాయవాది వద్ద జూనియర్ లాయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సభ్యసాచి ముఖర్జీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. ఆర్య సమాజ్ సూత్రాలతో 1970లో “ఆర్యసభ” అనే రాజకీయ పార్టీని స్థాపించారు.
అంతేకాక, ఆయన ప్రముఖ న్యాయవాదిగా మత పరమైన సమస్యలపై మాత్రమే కోర్టులో వాదించే వారు. ఎన్నో సామాజిక సమస్యలపై పోరాటం చేశారు. ఆడపిల్ల అని తెలిస్తే భ్రూణ హత్యలు ఎక్కువగా చేయిస్తున్న రోజుల్లో అందుకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల హక్కులు, భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మావోయిస్టులతో జరిగిన చర్చలకు ఆయన మధ్య వర్తిత్వం వహించారు. 1977లో హర్యానాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేగాక, మంత్రిగానూ ఆయన సేవలందించారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1981లో ఆయన మంత్రిగా ఉన్న సమయం లోనే బాలల వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు “బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్”ను స్థాపించారు.
మాయిస్టులతో చర్చలు జరపడంలో కీలకంగ పాత్ర పోషించారు. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ముఖ్యంగా దిల్లీ చుట్టుపక్కల ఉండే క్వారీల్లో కార్మికుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. హత్యానేరం ఆరోపణల్లో 14 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు. 2011వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అగ్నివేష్ కూడా పాలు పంచు కున్నారు. కొందరు నిరసన కారులు తన మీద వ్యక్తిగత, రాజకీయ ఎజెండాలతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆందోళనల నుంచి విరమించు కున్నారు. 2011 సంవత్సరంలోనే మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఐదుగురు ఛత్తీస్‌గఢ్ పోలీసులను విడిపించడంలో మావోయిస్టులతో జరిపిన బృందంలో అగ్నివేష్ కూడా ఒకరు.
1970లో సన్యాసం స్వీకరించారు స్వామి అగ్నివేష్. అయితే, ఆయన మీద హిందూ వ్యతిరేక ముద్ర పడింది. ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయాన్ని హిందుయేతరుల కోసం కూడా తెరవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే అమర్‌నాథ్ శివలింగం కేవలం ఓ మంచు ముక్క అంటూ అగ్నివేష్ కామెంట్స్ చేయడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌పై జార్ఖండ్ తదితర ప్రాంతాలలో ఆయనపై ఏబీవీపీ, బీజేవైఎం, బీజేపీ కార్యకర్తలు పలుమార్లు దాడులు కూడా చేశారు. అయితే, అగ్నివేష్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కోట్లాది మంది మనోభావాలను దెబ్బ తీయడం సరికాదని స్పష్టం చేసింది. సెంటిమెంట్ మిళితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 2008లో దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో జరిగిన జమైత్ ఉలేమా ఈ హింద్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలకు హిందూ సంఘాల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఎవరో కొందరు ఉగ్రవాదులు చేసే తప్పుడు పనులకు మొత్తం మతాన్ని తిట్టడం సరికాదని ఆయన అన్నారు. అసలు అమెరికానే నెంబర్ వన్ టెర్రరిస్టు అని కూడా అన్నారు.
అగ్నివేష్ బిగ్ బాస్‌లో కూడా పాల్గొన్నారు. 2011 సంవత్సరంలో నవంబర్ 8 నుంచి 11 వరకు హిందీ బిగ్ బాస్ హౌస్‌లో అతిథిగా ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులతో జరిగిన చర్చలకు ఆయన మధ్యవర్తిత్వం వహించారు. భిన్న మతాల మధ్య పలు అంశాలపై ఆయన వారధిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమానికి స్వామి అగ్నివేష్ మొదటినుంచి సంపూర్ణ మద్దతుగా నిలిచి, ఉద్యమ సందర్భంలో జరిగిన సమావేశాలు, కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు. కాలేయ సంబంధిత సమస్యతో దిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్‌లో చేరి, శరీరంలో కొన్ని అవయవాలు విఫలం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్) చెందడంతో కొద్ది రోజులు ఆయన వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతూ, 2020 సెప్టెంబర్ 11న శుక్రవారం మృతి చెందారు. ఆధ్యాత్మికం, మత పరమైన అంశాలపై స్వామి అగ్నివేశ్ పలు పుస్తకాలు కూడా రాశారు. రాజీవ్ గాంధీ నేషనల్ సద్భావనా అవార్డు, రైట్ లైవ్లీహుడ్ అవార్డులు ఆయనను వరించాయి.