- బాధ్యులైన పోలీసులకు ఛార్జ్ మెమో
నిజామాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: పోలీసుల కళ్లుగప్పి ఓ నిందితుడు పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే..నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నంబర్ లేని బైక్ పై వచ్చిన ఇద్దరు అనుమానితులు పోలీసులను చూసి బైక్ అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వారిని వెంబడించగా ఒకరు తప్పించుకుపోగా మరో అనుమానితుడు పోలీసులకు చిక్కాడు. దీంతో అతని తనిఖీ చేయగా అతడి వద్ద బంగారు గొలుసు లభించడంతో అనుమానితునితోపాటు, బైక్ ను సైతం తదుపరి విచారణ నిమిత్తం సీసీఎస్ (సెంట్రల్ క్రై స్టేషన్) పోలీసులకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న సదరు నిందితుని విచారించగా అతడు కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందినవాడిగా పోలీసుల విచారణలో అంగీకరించారు. అయితే సదరు నిందితుడి వెంట ఉండి పరారైన మరో అనుమానితుడు అతడి సమీప బంధువేనని పోలీసుల విచారణలో తేలింది. అయితే అదుపులో ఉన్న అనుమానితుడి వద్ద లభించిన బంగారు గొలుసు ఎక్కడికైనా విచారించగా నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల పరిధిలో ఓ మహిళ వద్ద నుండి చోరీ చేసినట్లుగా సీసీఎస్ పోలీసుల విచారణలో అనుమానితుడు అంగీకరించినట్లు తెలిసింది. పరారైన మరో నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిజామాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సీఐ ఆధ్వర్యంలో బృందాన్ని కరీంనగర్ జిల్లాకు పంపించారు. తమ అదుపులో ఉన్న అనుమానితుని వెంటబెట్టుకొని అక్కడి వరకు వెళ్లిన సీసీఎస్ టీం కళ్లు కప్పి ఆ దొంగ పరారైనట్లు తెలిసింది. పోలీసులకు పట్టుబడిన 24 గంటల వ్యవధిలోనే అనుమానితుడు వారి చెర నుండి పారిపోవడంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సీసీఎస్ బృందంపై సీరియస్ గా పరిగణించినట్లు తెలిసింది. అంతేకాకుండా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అనుమానితుడు పరారీకి బాధ్యులుగా చేస్తూ సీసీఎస్ సీఐ తో పాటు అతని వెంట వెళ్లిన సిబ్బందికి పోలీస్ బాస్ ఛార్జ్ మెమో ఇచ్చినట్లు పోలీస్ అధికారుల ద్వారా తెలిసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు