– అదుపుతప్పి ముందున్న వాహనాలను ఢీకొన్న ట్రక్కు
– మంటలు చెలరేగి 11మంది సజీవ దహనం
లక్నో, ఏప్రిల్ 23 : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టడంతో 11 మంది సజీవ దహనమయ్యారు. లసోడా ప్రాంతం వైపు వెళుతున్న ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి ముందు వెళుతున్న కారును, కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కంటైనర్ దానిముందు ప్రయాణికులతో వెళుతున్న ఓ బొలేరును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో బొలేరోలోని 11మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చి డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని, ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





