మేడ్చల్/ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 3: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరిరావు నివాసంతోపాటు ఇతర పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఉప్పల్‌లోని హైకోర్టు కాలనీలో ఉన్న ఆయన నివాసంతోపాటు సూర్యాపేటలోని ఇతర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున సోదాలు ప్రారంభమయ్యాయి. ఈ ఆపరేషన్‌కు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. అధికారులు ఆస్తి పత్రాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
———————————————————————————————————————————————————-తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





