ఏసీబీకి చిక్కిన మరో లంచావతారం

– రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

వరంగల్, ప్రజాతంత్ర, మే 14: పూర్వీకుల ఆస్తిని తన పేరుపై మ్యుటేషన్ కోసం సంప్రదించిన బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో చిక్కారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తహసీల్దారు కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న జి.రాంబాబు బాధితుడి నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని ఆర్ఐపై కేసు నమోదు చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని, వాట్సప్ నంబర్ 9440446106కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *