హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28: సహచర ట్రెనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదు నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాద్ తరలించారు. శంకరపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడలో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ కేసు దర్యాప్తును ఉమెన్స్ సేప్టీ వింగ్‌కు నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ బదిలీ చేశారు. అకాడమీలో తనపై వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణారెడ్డిపై ఈ నెల 18న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగికంగా వేధించడంతో పాటు.. వ్యక్తిగత వీడియోలను తన భర్తకు పంపించి ఇబ్బందులకు గురి చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా నిందితుడు పేర్కొన్న రెండు చిరునామాల్లోనూ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా పోలీసులకు అతడి ఆచూకీ లభించలేదు. సెల్‌ఫోన్ కూడా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


