రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 28: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసి మృతి చెందారు. ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) న్యూజెర్సీలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మాడుగుల మండల కేంద్రానికి చెందిన పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖ దంపతుల కుమార్తె అయిన దీపారెడ్డికి 20 ఏళ్ల కిందట ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డితో వివాహమైంది. ఇద్దరూ సాప్ట్‌వేర్ ఇంజినీర్లు కావడంతో అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. దీపారెడ్డి కారులో ప్రయాణిస్తూ న్యూజెర్సీలో సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరికి ఇద్దరు కూతుళ్లు సంస్కృతి, హర్షిత ఉన్నారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


