– జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాలు
న్యూదిల్లీ, మే 14: దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్) మూడో దశను ప్రారంభించనున్నట్లు భారత ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్ మినహా దేశం మొత్తం ’సర్’ పరిధిలోకి వస్తుందని ఈసీ వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, ఉత్తరాఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు, దేశ రాజధాని దిల్లీ, చండీగఢ్, దాద్రానగర్ హవేలి` దమన్`దియు కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో దశ ’సర్’ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 3.94 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు), జనాభా గణనకు రాజకీయ పార్టీలు నియమించిన 3.42 లక్షల మంది బూత్‌స్థాయి ఏజెంట్ల (బీఎల్‌ఏల) సహాయంతో ఇంటింటికీ వెళ్లి 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలు తనిఖీ చేస్తారని తెలిపింది. మే 30 నుంచి అక్టోబర్ 14 వరకు ’సర్’ మూడో దశ పక్రియ జరుగుతుందని, జూలై 5 నుంచి అక్టోబర్ 21 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రచురణ కొనసాగుతుందని ఈసీ వెల్లడించింది.
——————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.