– శాతవాహన ఇంజినీరింగ్ కళాశాల భవనాలకు భూమిపూ
– ఏడాదిలో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు
– రూ.15 కోట్లతో హాస్టల్ భవనాల నిర్మాణం
– హుస్నాబాద్ ను ఉన్నత విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం
– మంత్రులు పొన్నం, వివేక్
సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 10: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి శుక్రవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభమై మొదటి విద్యా సంవత్సరం పూర్తవుతున్న తరుణంలోనే శాశ్వత భవనాల నిర్మాణానికి భూమిపూజ చేయడం సంతోషకరమన్నారు. రెండో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతాయని, ఏడాదిలోపే భవనాలను పూర్తి చేస్తామని తెలిపారు. విద్యార్థుల వసతి కోసం రూ.15 కోట్లతో హాస్టల్ భవనాల నిర్మాణానికి యూనివర్సిటీ పరిపాలనా అనుమతులు లభించాయని, త్వరలోనే వాటికి కూడా శంకుస్థాపన నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక్కడ ప్రియాంక గాంధీ పేరుతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో పీజీ మెడికల్ కాలేజీ కూడా మంజూరైందని చెప్పారు. ఉమ్మాపూర్ పరిసర ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్క్, భైరవస్వామి ఆలయం, మహాసముద్రం గండి వంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ఈ ప్రాంత అభివృద్ధికి విద్యాసంస్థలు మరింత ఊతమిస్తాయని అన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు కావడం ఈ ప్రాంత విద్యా రంగానికి శుభపరిణామమన్నారు. మొదటి ఏడాదిలో 250 మంది విద్యార్థులు చేరారని, నాలుగేళ్లలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేసే స్థాయికి కళాశాల అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, సీపీ రష్మీ పెరుమాళ్, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగుతో కోతుల బెడదకు చెక్
ఆయిల్పామ్ సాగు ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం లభించడంతో పాటు కోతుల బెడద ఉండదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో నిర్వహించిన మెగా పామ్ ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భం గా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో 50 వేల ఎక రాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 14 వేల ఎకరాలకు పైగా సాగు జరుగుతోందన్నారు. ప్రతి చిన్న గ్రామంలో కనీసం 100 ఎకరాలు, పెద్ద గ్రామాల్లో 200 ఎకరాలకు పైగా ఆ యిల్పామ్ సాగు జరిగేలా రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 100 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసిన గ్రామాలకు రూ.5 లక్షలు, 200 ఎకరాలకు పైగా సాగు చేసిన గ్రామాలకు రూ.10 లక్షల అ భివృద్ధి ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉ న్నందున రైతులు ఆరుతడి పంటలతో పాటు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. మంత్రి వివేక్ వెం కటస్వామి మాట్లాడుతూ దేశంలో వంటనూనె అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్పామ్ ఉత్పత్తిని పెంచడం అత్యవసరమన్నారు. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 100 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసిన గ్రామాలకు మంత్రి పొన్నం ప్రక టించిన రూ.5 లక్షల ప్రోత్సాహకానికి అదనంగా జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా మరో రూ.5 లక్షలు ప్రకటించారు.
———————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





