మహిళా శక్తిని చాటుకుందాం
భారతదేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి ప్రతి గంటకు 51 కేసులు పోలీస్ స్టేషన్ లలో నమోదు అవుతున్నట్లు జాతీయ నేర పరిశోధన సంస్థ 2023 నివేదిక తెలిపింది.ఇంకా పోలీస్ స్టేషన్ కు రాకుండా ఉన్న కేసులు మూడింతలు ఉండవచ్చు.నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం మహిళలపై 2016లో 3,38,954 నేరాలు జరుగగా, 2022 నాటికి 4,45,256కి నేరాలు పెరిగి పోయాయి.2016-2022 నాటికి 26.35% నేరాలు పెరిగాయి.మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి 2012 ఫోక్సొ చట్టం వచ్చింది. ఈ చట్టం రావడంతో మైనర్లపై నేరాలు తగ్గుతాయని భావించడం జరిగింది.కానీ రోజురోజుకు మైనర్లపై నేరాలు తీవ్రమవుతున్నాయి 2018 లో ఫోక్సొ చట్టం క్రింద 37,798 కేసులు నమోదు కాగా 2022 నాటికి 61,303 మంది బాలికలపై నేరాలు జరిగాయి. గడిచిన ఐదు సంవత్సరాలలో 2,51,825 (పోస్కో) కేసులు నమోదు కాగా 25,961 కేసుల్లో మాత్రమే నేరస్థులకు శిక్షలు పడ్డాయి. రోజు రోజు కు చైతన్యం, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కాలంలో ఈ తీరు చూస్తుంటే బేటి బచావో నినాదం ఏ విధంగా అమలైతుందో అర్థం చేసుకోవచ్చు.
2020 ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.19 ఏళ్ల బాలికపై అగ్రకులానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారుతీవ్రగాయాలతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనలో కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే పోలీసులు బాలిక డెడ్ బాడీని దహనం చేశారు.ఈ సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తాయి.ఈ కేసులో ఆధారాలను కనుమరుగు చేసే కుట్రలను న్యాయస్థానం చేదించింది. నలుగురు నిందితుల్లో ముగ్గురు విడుదలయ్యారు.నాలుగవ వ్యక్తి,సందీప్ ఠాకూర్ దోషిగా నిర్ధారించి జీవిత ఖైదీ విధించింది.
అధికారం ఉంటే నిందితులను వెనుకేసుకొస్తారా.!
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతనని పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని 2023 ఏప్రిల్ లో ప్రధమ శ్రేణి ఏడుగురు మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున రోజుల తరబడి దిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అయినా బిజెపి ప్రభుత్వం అతనిపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపులు మరియు ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తే తప్ప అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. అయినా అతన్ని అరెస్ట్ చేయకుండా బిజెపి కాపాడుతుంది.ఈ విధానం చూస్తుంటే కామాంధులను బిజెపి ఏ విధంగా కాపాడుతుందో స్పష్టమవుతుంది.
మణిపూర్ మహిళల గోస పట్టదా.!
2023 మే మణిపూర్ లోని కుకీ తెగకు చెందిన మహిళల పై సాయుధ దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం జరిగింది.వారిని అరెస్టు చేయడంలో ఆ ప్రభుత్వం చిత్తశుద్ధి ని ప్రదర్శించలేదు.సుదీర్ఘ కాలంగా మణిపూర్ ఆదివాసి మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూ వస్తున్నా బిజెపి ప్రభుత్వం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తూ వస్తుంది.మణిపూర్ రాష్ట్రం అగ్ని గుండ ంలా మారినా,వందలాది మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసినా,ప్రతిపక్షాలు పార్లమెంట్ ను స్థబింప చేసినా, మణిపూర్ ఘటనపై ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం కలత చెందినా మోదీ కనీసం నోరు మెదపడం లేదు.
లైంగిక నేరాలకు పాల్పడ్డా భి-ఫాం ఇస్తారా.!
ఎంత దుర్మార్గం అంటే భి-ఫాం ఇచ్చేటప్పుడు కనీసం వారి నేర చరిత్ర ను కూడా అధ్యయనం చేయడం లేదు. దేవగౌడ మనువడు ప్రజ్వల్ రేవణ్ణ 3,000 మంది మహిళల సెక్స్ వీడియోలు పెన్ డ్రైవ్‌లో ఉండటం,ఇందులో ప్రభుత్వ అధికారులైన మహిళలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు,వీడియోల పై పెద్ద ఎత్తున దుమారం లేవడంతో జర్మనికి పారిపోయాడు.ఈ తతంగం కర్ణాటక రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపి వేసింది భారీ ఆందోళనలు చేపట్టారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ సూచన మేరకు లైంగిక వేధింపుల కేసులు అతనితో పాటు అతని తండ్రి అయిన హెచ్డి రేవన్న పై కూడా ఏప్రిల్ 2024 నమోదు చేయడం జరిగింది.అతని బాధితులు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన ప్రజ్వల్ రేవణ్ణకు 2024 లో కర్ణాటక లోని హసన్ లోక్‌సభ స్థానం(జేడిఎస్) నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలోకి దింపడం జరిగింది. అక్కడి ప్రజలు ఓడించి ఇంటికి సాగనంపారు.ఎంత నీచమైన సంస్కృతి కి బిజెపి తెరలేపిందో అర్థం చేసుకోవచ్చు.
బాబాలైతే వదిలేస్తారా.!
తమిళనాడు లోని కోయంబత్తూరు లో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ బాబా పై న్యాయస్థానంలో రిటైర్డ్ ప్రొఫెసర్ హెబియఎస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.జగ్గి వాసుదేవ్ బాబానునా ఇద్దరు బిడ్డలు కలిసిన తర్వాత వారి మైండ్ వాష్ చేసి సన్యాసం తీసుకునేలా చేశాడని,వారు ఇంటికి కూడా రావడం లేదని పేర్కొన్నాడు. నీ కూతురుకు పెళ్లి చేసుకుంటూ ఇతరుల బిడ్డలకు సన్యాసమా అని కూడా మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. గతంలో ఈ ఫౌండేషన్ పై పోక్సో వంటి అత్యాచారం కేసులు నమోదయ్యాయని వాటిపై కూడా విచారణ చేయాలని ఆక్టోబర్ 2024 లో తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆశ్రమాల పేరుతో ఆడపిల్లల హక్కులను కాలరాస్తున్నవారి ఆరోగ్యాన్ని,బాగోగులను చూసుకోవడంలో మోదీ ప్రభుత్వం ముందంజలో ఉంది.కోల్కత్తాలోని ఆర్.జి.కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లోపిజి డాక్టర్ పై 2024,9 ఆగస్టున జరిగిన అత్యాచారం దేశాన్ని కుదిపివేసింది.
ఎన్నికల్లో పోటి చేయకుండా నిషేదించాలి
మహిళల పై నేరాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల లో అత్యధిక మంది ధనవంతులే కావడం గమనార్హం.వీరు పోలీసుల విచారణ తో పాటు న్యాయవ్యవస్థ ను కూడా ప్రభావితం చేయడంలో శక్తివంతులు. కేసును విరమింపచేసుకునేలా కేసు పెట్టిన బాధితులను,వారి కుటుంబాలను వేధిం పులకు గురిచేస్తూనే ఉంటారు.భయబ్రాంతులకు కూడా గురి చేస్తారు.వెనక్కి తగ్గకపోతే హత్యలకు కూడా వెనుకాడరు. ప్రజాస్వామ్యం బతకాలంటే నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ఎన్నికలలో పాల్గొనకండా నిషేధించాలి ,ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్‌న్యాయస్థానాలు ఏర్పాటుచేసిప్రజా ప్రతినిధులుకు సంబంధించిన మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు వేగవంతంగా విచారణ జరిపి తీర్పులను వేగవంతంగా వెలువరించాలి. 2020 ఫిభ్రవరి లో ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం నేరచరిత్ర కలిగిన వారికి టికెట్లు ఎందుకు ఇస్తున్నారని కూడా పార్టీ లని ప్రశ్నించింది.ఐనా అలాంటి వారికే పెద్ద పీఠ వేస్తున్నారు.మహిళల పైగాని,ఇతర నేరాలకుగాని పాల్పడమని పోటిచేసే అభ్యర్థులు సెల్ప్ డిక్లరేషన్ ఇవ్వండి అని ప్రతిపాదన పెట్టాలి. ప్రజా ప్రతినిధులు ఐన తర్వాత లైంగిక వేధింపులు మరియు రేప్ కేసులు,పొక్సో కేసులు నమోదైతే విచారణ జరిపి తీర్పు వెల్లడించి దోషులుగా తేలితే శాశ్వతంగా ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేదించాలి.
పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక 9441661192





