లగచర్ల ఘటనలో బీఆర్‌ఎస్‌ ‌కుట్ర

రైతులను రెచ్చగొడుతున్న కేటీఆర్‌, ‌హరీష్‌రావు
– రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 15: ‌లగచర్ల ఘటన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కుట్రేనని, మాజీ మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి దుద్ధిల్ల శ్రీధర్‌ ‌బాబు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులూ ఉన్నా రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామన్నారు. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి తమకు అప్పగించారని విమర్శించారు. అయినా తాము నిధులు సమకూర్చుకుంటున్నామని, హరీష్‌ ‌రావు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో మంత్రి శ్రీధర్‌ ‌బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సన్నాలు పండించిన ప్రతీ రైతుకు బోనస్‌ ఇస్తామన్నారు. రైతులు ఎవరు చింతించవద్దని, అందరికీ బోనస్‌ ఇస్తామని భరోసా కల్పించారు. ధాన్యం సేకరించిన వారం రోజుల్లోపే రూ.500 బోనస్‌ ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి పక్షాలు సూచనలు చేయాలికానీ దుష్ప్రచారం చేయకూడదన్నారు. ప్రభుత్వ అధికారులను తరిమి కొడతామని అగ్ర నేతలు వాఖ్యానించడం, అధికారులపై దాడి చేస్తే ఖండిచకుండా ఆహ్వానిస్తారా అని ప్రశ్నించారు. కలెక్టర్‌ ‌గ్రూప్‌ ‌వన్‌ అధికారిని చంపే ప్రయత్నం జరిగిందా? లేదా? ప్రజాస్వామికంగా తాము ముందుకు వెళ్తున్నామన్నారు. అధికార యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురిచేస్తామనటం అంటే సరైనదేనా ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని మంత్రి విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *