హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12: సఫిల్ గూడ లేక్ పార్క్‌లో గల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ ఆమ్రపాలి కాటతో కలిసి సఫీల్ గూడ లేక్ పార్కును పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రావణ్, కాలనీ వాసులు వాకర్స్ పలు సమస్యలను మేయర్ కు తెలిపారు. సఫిల్ గూడ చెరువులో గుర్రపు డెక్క తో మురుగు నీరు కలుస్తున్నందున దోమలు విపరీతంగా ఉన్నాయని వివరించారు. మురుగు నీరు రాకుండా వాటర్ వర్క్ అధికారులతో మాట్లాడి డైవర్షన్ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని అదే విధంగా పూర్తిగా గుర్రపు డెక్క తొలగించిన తర్వాత టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని, అవసర మనుకుంటే బోటు ఏర్పాటుకు చర్యలు తీసుకు ంటామని కమిషనర్ మేయర్ తెలిపారు.
పార్క్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. అవి కొన్ని మరమ్మత్తులు చేయాలని వాకార్స్ వివరించడం తో 15 రోజుల్లో మరమ్మతులు చేయాలని అంటే కాకుండా ఓపెన్ జిమ్ వద్ద వర్షాలు కురిసి నప్పుడు బురదగా ఉంటుందనీ అక్కడ కూడా బురద లేకుండా మొరం పోయాలని అధికారులను ఆదేశిం చారు. చెరువు కట్ట పైన పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. తదనంతరం దీన్ దయాళ్ కాలనీలో నాలానుపరిశీలి ంచారు. నాలాలో ప్రమా దాలు సంభవించ కుండా భద్రత చర్యలు తీసుకో వాలని అధికారులను వారు ఆదేశించారు. మేయర్, కమిషనర్ వెంట సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్,ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.





