30న జాబ్-మేళా

– 15 సీఎన్‌సీ మెషిన్ ఆపరేటర్/ఎంట్రీ లెవెల్ స్టాఫ్ పోస్టుల భర్తీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఏఎన్‌బి ఇంటీరియర్స్ ఎక్స్‌టీరియ‌ర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈనెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్(యుఈఐ అండ్ జీబీ/ఎంసీసీ) ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ జాబ్ మేళా జరుగుతుంది. ఏఎన్‌బి ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని సీఎన్‌సీ మెషిన్ ఆపరేటర్/ఎంట్రీ లెవెల్ స్టాఫ్‌కు చెందిన 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీటెక్ మెకానికల్, డిప్లొమా- మెకానికల్, ఏదైనా డిగ్రీ చేసిన యువతీయువకు 18 నుండి 35 సంవత్సరాల వయసు వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. రూ.18,392 వరకు వేతనం ఉండే ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలకు హెచ్‌ఆర్, సుభోజిత్ రాయ్(ఫోన్ 8712638384)ను సంప్రదించాలని కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో( యుఈఐ అండ్ జీబీ/ఎంసీసీ) వద్ద నేరుగా ఏప్రిల్ 30న హాజరు కావాలని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *