అత్యాచారం కేసులో నిందితునికి పాతికేళ్ల జైలు

నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పాతికేళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం గురువారం తీర్పును వెలువరించింది. 2020 మే 30న మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధిత మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కరీంనగర్‌కు చెందిన నిందితుడు మహమ్మద్ జాకీర్ బాబాపై కేసు నమోదు అయింది. సామాజిక మాధ్యమాలలో పరిచయం ఏర్పరచుకుని అతడు మిర్యాలగూడ వచ్చి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విచారణలో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితునికి 366(2)(i) కిడ్నాప్ కింద అయిదేళ్ల కారాగార శిక్ష, సెక్షన్ 3 అండ్ 4 పోక్సో చట్టం 2012 కింద 20 సంవత్సరాల కారాగార శిక్ష మొత్తంగా 25 సంవత్సరాల కారాగార శిక్షను న్యాయమూర్తి విశ్వనాధ్ కులకర్ణి దిలీప్ రావు విధించారు. బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారాన్ని న్యాయస్థానం ప్రకటించింది. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ డి.శ్రీనివాస్ రెడ్డి, సీడీవో బి.అఖిల్, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన తదితర అధికారులు కేసు విచారణలో తోడ్పాటు అందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

#

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *