Day August 13, 2026

రక్తసిక్తమైన సరిహద్దులు – భారత విభజన పూర్వాపరాలు

“1947 ఆగస్టు 14న పాకిస్థాన్, ఆగస్టు 15న భారతదేశం అవతరించాయి. కానీ సరిహద్దుల ప్రకటన వెలువడగానే ప్రపంచ మానవ చరిత్రలోనే అతిపెద్ద బలవంతపు జనాభా మార్పిడి (Mass Migration) సంభవించింది. తమ శతాబ్దాల నాటి ఆస్తులను, ఇళ్లను, పూర్వీకుల జ్ఞాపకాలను వదిలేసి హిందువులు, సిక్కులు భారత్‌కు, ముస్లింలు పాకిస్థాన్‌కు కాలినడకన, ఎడ్ల బండ్లపై, కిక్కిరిసిన రైళ్లలో…

కాగితాలపై ఎక్కువ పని దినాలు.. క్షేత్రస్థాయిలో తగ్గిన ఉపాధి

జూలైలో వీబీ జిరామ్ జి  కింద 7.67 కోట్ల వ్యక్తి-పని దినాలు.. గత ఏడాది  ఎంజిఎన్ఆర్ఈజి   లో 15.33 కోట్లు; ఉపాధి పొందిన కుటుంబాలు 51% తగ్గుదల కొత్తగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్–గారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్  వీబీ జిరామ్ జి   పథకం అమల్లోకి వచ్చిన తొలి నెలలోనే గ్రామీణ ఉపాధి కల్పనలో గణనీయమైన తగ్గుదల నమోదైంది.…

ఊరు -జనజ్వాల

ఏటి ఒడ్డున కట్టుకున్న ఇసుకదిబ్బల గూడు కళ్ళలో దృశ్య రేణువు కలవరపెడుతుంది. బాల్యం మీద సీతాకోక ఎగిరిపోయినట్లే, ఇప్పుడు చేతులకు వేలాడుతున్న పాదాల సమూహం నిర్మించుకున్న శ్రమ శిల్ప ఇసుక గూడు లేదు నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. అక్కడ ఏరు కూడా లేదు. ఊరు తన రూపం మార్చుకొని విశ్వసుందరి పోటీలో నిలబడింది.

ఒక పాపి వందమంది పుణ్యాత్ములు!

  -బమ్మిడి జగదీశ్వరరావు బ్రహ్మయ్య కొయ్యబారిపోవడం చూసిన సరస్వతమ్మ ‘యేమయిందండీ’ అని ఆందోళనగా అడిగింది. ‘వీళ్ళను నేనే పుట్టించానా?’ అన్నాడా దేవదేవుడు గొంతు తడారిపోతుండగా, నేల చూపులు చూస్తూ. మగని చూపులవెంట నేలమీదకు చూసింది సరస్వతమ్మ. బ్రహ్మయ్య కాలచక్రాన్ని రవ్వంత వెనక్కి జరిపాడు. కథ వెనక్కి వచ్చింది. మొదలైన దగ్గరికి! ఎండ వొంట్లోని నీటిని చెమట…

బొగ్గు, గ‌నుల రంగంలో పార‌ద‌ర్శ‌క‌తకు చర్యలు

– మీడియా స‌మావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : బొగ్గు, గనుల రంగంలో మోదీ నాయకత్వంలో గత పన్నెండేళ్లుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గతంలో మాదిరి కాకుండా ఈ-ఆక్షన్ ద్వారా బొగ్గు, గనుల రంగంలో కేటాయింపుల విషయంలో పారదర్శకత…

శిక్ష

ముళ్ళకంపలు అరచేతి నిండా మొలిచినట్టు కంపరం అమాంతంగా బరువెక్కిన కుడి చేతివేళ్ళ చివర్లనుండి కన్నీరు కారుతోంది సొంత బిడ్డల్ని దండించే ప్రాణి సృష్టి మొత్తానికి మనిషొక్కడేనేమో ఖరారుగా చెప్పగలను నీ చెంప నొప్పి కంటే నా గుండెకి కలిగిన నొప్పి రెండింతలని పశు వాసనతో అరచేతి పశ్చాత్తాపం ఇదే ఆఖరు కావాలి చిన్నా, ఇంకెప్పుడూ చెయ్యెత్తను…

యుద్ధం ఎందుకు? -నాగినీ కందాల

చరిత్రలో పునరావృతమవుతున్న అత్యంత విషాదకరమైన సంఘటన యుద్ధం. నాగరికత అభివృద్ధి చెందింది, శాస్త్రసాంకేతిక రంగం ఊహించని ఎత్తులకు చేరుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష పరిశోధనలు, జన్యు విజ్ఞానం, సమాచార విప్లవం– దాదాపు ప్రతి రంగంలోనూ మనుషులు మునుపెన్నడూ లేనన్ని అపూర్వ విజయాలు సాధించారు. అయినా యుద్ధాన్ని మాత్రం ఆపలేక పోయారు. శాస్త్రం మనిషి జీవితాన్ని సులభతరం చెయ్యడంతో…

హర్ ఘర్ తిరంగా అభియాన్‌కు భారీ స్పందన

– తార్నాకలో ఘనంగా తిరంగా యాత్ర – 200 మీటర్ల పొడవైన జాతీయ పతాకం ప్రదర్శన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : తార్నాక డివిజన్‌లో హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా నిర్వహించిన ఘనమైన తిరంగా యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పాల్గొన్నారు. తార్నాక ప్రజలు, యువత, విద్యార్థులు రాజకీయాలకతీతంగా అధిక…

డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం

– ఎయిర్‌పోర్టుకు త‌ర‌లివ‌చ్చిన‌ ఎమ్మెల్యేలు, నేతలు – గజమాలతో అభిమానం చాటుకున్న రంగారెడ్డి అధ్యక్షుడు చల్లా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు పార్టీ రాష్ట్ర నేతలు, పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం…