– ఎయిర్‌పోర్టుకు తరలివచ్చిన ఎమ్మెల్యేలు, నేతలు
– గజమాలతో అభిమానం చాటుకున్న రంగారెడ్డి అధ్యక్షుడు చల్లా
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు పార్టీ రాష్ట్ర నేతలు, పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. వైరా శాసనసభ్యుడు రాందాస్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, చల్లా నరసింహారెడ్డి, నాయుడు సత్యం, అన్వేష్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ ఉపాధ్యక్షుడు నెమిండ్ల శ్రీనివాస్, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, ‘సుడా’ చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, పీసీసీ అధికార ప్రతినిధి, ఓయూ జేఏసీ అధ్యక్షుడు లోకేష్ కుమార్ యాదవ్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలికేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. విమానాశ్రయ ప్రాంగణం కార్యకర్తల నినాదాలతో కోలాహలంగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందరికీ నమస్కరిస్తూ అభివాదం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




