Day July 21, 2026

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట

– పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, ఆరోగ్య భద్రత పథకాలపై సమగ్ర సమీక్ష – విద్య, వైద్యం, వివాహ సహాయం, బీమా పథకాల బలోపేతానికి ఆదేశాలు – పోలీసు పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, పోటీ పరీక్షలకు ప్రత్యేక ప్రోత్సాహం – సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం – ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందేలా…

వ్యవస్థ వైఫల్యానికి హెచ్చరిక ..!

భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని రోజులు కేవలం క్యాలెండర్ తేదీలుగా మిగిలిపోవు. అవి ఒక తరం ఆవేదనకు, ఆకాంక్షకు, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. సోమవారం న్యూ దిల్లీలో కనిపించిన దృశ్యం అలాంటిదే. దేశ అధికార కేంద్రంగా పేరొందిన ల్యూటెన్స్ దిల్లీ ప్రాంతం ఒక్కసారిగా యువత, విద్యార్థులు, నిరుద్యోగుల జనప్రవాహంతో నిండిపోయింది. పార్లమెంట్ వైపు వెళ్లే ప్రతి…

‌గురువులకు ఎగనామం!

హైదరాబాద్‌: ‌దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అధ్యాపకుల సమ్మెతో యూనివర్సిటీలు, కాలేజీలు మూతపడ్డాయి. ఐదో వేతన సంఘం సిఫార్సులకు అనుగుణం గా తమ జీత భత్యాలు, సర్వీసు నిబంధనలను సవరించనందుకు నిరసనగా అధ్యాపకులు దేశ వ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఆగస్టు 11 నుంచి మొదలైన సమ్మె 27 నుంచి ఊపందుకుంది. అడ్మిషన్లు, పరీక్షలు ఎక్కడి వక్కడ ఆగిపోయాయి.…

న‌వ‌భార‌తంలో ప్ర‌శ్నించేవారు దేశ‌ద్రోహులు!

“ఆత్మ‌కు మోక్షం రావ‌డానికి మ‌తంలో భ‌క్తి ఒక మార్గం కావ‌చ్చు. కానీ రాజకీయాలలో, భక్తి లేదా వీరపూజ అనేది పతనానికి, చివరికి నియంతృత్వానికి దారితీసే కచ్చితమైన మార్గం.”— డా. బి.ఆర్. అంబేద్కర్, 1949 డాక్టర్ అంబేద్కర్ పార్లమెంటులో ఈ గంభీరమైన రాజ్యాంగ జ్ఞానాన్ని వెల్లడించడానికి చాలా కాలం ముందే, ప్రఖ్యాత గ్రీకు వీరుడు ఒడిస్సియస్ తన…

ఒకే వోటు.. ఒకే విలువ

భారత రాజకీయ భవిష్యత్తును శాసించే నియోజక వర్గాల పునర్విభజన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన, సున్నితమైన రాజ్యాంగ ప్రక్రియ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌). ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేగవంతం చేయడంతో దేశ రాజకీయ యవనికపై సరికొత్త చర్చ ప్రారంభమైంది. ప్రజాస్వామ్యంలో “ఒక వ్యక్తికి ఒకే వోటు, ఒకే విలువ” అనే…

తిరుమల యాత్రలో ఆన్లైన్ కష్టాలు

Tirumala Online Booking Issues Leave Devotees Frustrated

కలియుగ వైకుంఠంగా కోట్లాది మంది ఆరాధించే తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం ప్రతి భక్తుడి జీవితకాల ఆకాంక్ష. జీవితంలో ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలనే కోరికతో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది తిరుమలకు చేరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం సాంకేతికతను వినియోగిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చెబుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం సామాన్య…

ఈ నెత్తుటి మరకలు ఎక్కడివి?

అసహనం మనుష్యుల కే కాదు!ప్రభుత్వాలకి ఉంటుంది? మానసిక వైకల్యం మనుష్యులకే కాదు!వ్యవస్థలు కూడా ఒక్కోసారి అలా మారిపోతుంటాయి.ముఖ్యంగా అధికారం పోగుపడ్డ అహంకారం గాయపడ్డప్పుడు చేష్టలే కాదు భాష కూడా విచలితం అవుతుంటుంది.ఇప్పుడు తెలంగాణలో నెత్తుటి భాష రాజ్యం ఏలుతుంది.. నెత్తుటి మరకలు రాజకీయ చరిత్ర ముఖం మీద పుట్టుమచ్చలు,పెట్టుమచ్చలు అవబోతున్నాయి.తెలంగాణానే కాదు, ఆంధ్రప్రదేశ్ లోకూడా అదే…