Day May 6, 2026

హైడ్రా.. పేదల ఇళ్లను కూల్చడానికేనా?

– నాదర్గుల్‌లో చెరువు కబ్జా చేస్తుంటే నిద్రపోతున్నదా – కాంగ్రెస్ కనుసన్నల్లోనే ‘కాసుబాగ్ కంచ’ భూముల కబ్జా – ‘రియల్‌’ మాఫియా, పోలీసు దాడుల నుంచి రక్షించాలని హరీశ్ కు రైతుల మొర హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613 (119) కాసుబాగ్…

జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ

– బత్తిన కుటుంబ సభ్యుల ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: ఆస్తమా వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం పంపిణీ జూన్ 8న ప్రారంభించనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులను వివారించేందుకు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్…

విచారణ వాయిదా కుదరదు : సుప్రీం కోర్టు

– సీఈసీ నియామకంలో సీజే తొలగింపు కేసు.. న్యూదిల్లీ, మే 6: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ నియామకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యత్వాన్ని తొలగించిన కేసుపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా వేయాలని…

రుణ మాఫీ, మద్దతు ధరతో రైతుకు అండ

– పేదల ముంగిటకే ‘ప్రజాపాలన’ – అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు – ఈ నెలాఖరుకు రెండో విడత మంజూరు – 35 రోజుల్లోనే సాదా బైనామా సమస్యల పరిష్కారం – గువ్వలగూడెం ‘ప్రజాదర్బార్’లో మంత్రి పొంగులేటి నేలకొండపల్లి, ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం అడుగులు…

భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి బాధ్యతల స్వీకర‌ణ‌

– గవర్నర్‌తో మర్యాదపూర్వక భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ బి.శివధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని 8వ అంతస్తులో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల…

జాతీయస్థాయిలో విజయవంతమైనందునే..

– రాష్ట్రంలోనూ హామ్ మోడల్ అమలుకు నిర్ణ‌యం – ప్రభుత్వ వివరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : జాతీయస్థాయిలో, తర్వాత ఏడు రాష్ట్రాల్లో విజయవంతమైౖనందున దీర్ఘకాలిక నిర్వహణ (15 సంవత్సరాలు)తో పాటు ఆర్థిక వృద్ధికి దోహదం చేయడం, కొత్త పరిశ్రమలు స్థాపనకు అవకాశం కల్పించడం, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం వంటి లక్ష్యాలతో తెలంగాణ…

రేపు బీహార్ కేబినెట్ విస్తరణ

– మంత్రివర్గంలో నితీశ్ తనయుడు నిశాంత్ ! పాట్నా, మే 6 : బీహార్‌లో గురువారం కీలక మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. గాంధీ మైదానంలో పెద్దఎత్తున ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. జేడీయÖ నేతలు మంగళవారం రాత్రి జరిపిన…

కేటీఆర్.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకో

– మంత్రి సీతక్క హెచ్చరిక ములుగు, ప్రజాతంత్ర, మే 6 : త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ మీద, క్షణం తీరిక లేకుండా ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఖండించారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే…

మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలపండి

– ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాలి – ఎయిర్‌పోర్ట్-ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను ఫేజ్-3 కింద చేపట్టండి – కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మే 6 : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి…