విచారణ వాయిదా కుదరదు : సుప్రీం కోర్టు

– సీఈసీ నియామకంలో సీజే తొలగింపు కేసు..

న్యూదిల్లీ, మే 6: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ నియామకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యత్వాన్ని తొలగించిన కేసుపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. కాగా, ఈ అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తాను ’శబరిమలలో మహిళల ప్రవేశం’ కేసును పర్యవేక్షిస్తున్నందున ఈ కేసును కొద్ది రోజులపాటు వాయిదా వేయాలని కేంద్రం తరఫు వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానాన్ని కోరారు. ఆయన అభ్యర్థనను జస్టిస్ దీపాంకర్ దత్త తిరస్కరిస్తూ ఈ పిటిషన్‌పై విచారణ అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. చాలా రోజుల క్రితమే విచారణ తేదీని ఖరారు చేశామని, ఇప్పుడు వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. శబరిమల కేసును అసలు విచారించకపోవడమే మంచిదని మంగళవారం తొమ్మిదిమంది న్యాయమూర్తుల ధర్మాసం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సీఈసీ, ఈసీ నియామకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) స్థానంలో కేంద్ర మంత్రిని తీసుకునేందుకు ప్రతిపాదిస్తూ కేంద్రం చట్టం చేసింది. అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసి కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన అధికారులను ఎన్నికల అధికారులుగా నియమించుకునే అవకాశం ఉందని పలువురు ఆందోళన లేవనెత్తారు. ఈ చట్టం కింద జరిగిన నియామకాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *