– బత్తిన కుటుంబ సభ్యుల ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: ఆస్తమా వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం పంపిణీ జూన్ 8న ప్రారంభించనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులను వివారించేందుకు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ ఉంటుందని బత్తిని మృగశిర ట్రస్టు నిర్వాహకులు, దివంగత బత్తిని హరినాథ్ కుమారుడు అమర్నాథ్ గౌడ్ తెలిపారు. జూన్ 8న తమ కుటుంబ సభ్యులు చేప ప్రసాదం సేవించిన తర్వాత సాయంత్రం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానానికి తరలించనున్నట్లు తెలిపారు. ముహూర్తం ప్రకారం అదేరోజు రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. చేప ప్రసాదం పంపిణీకి ఇప్పటికే ఫిషరీ డిపార్ట్‌మెంట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్, పోలీస్ డిపార్ట్‌మెంట్ జీహెచఎంసీ, ప్రభుత్వం అనుమతులు తీసుకున్నామని అమర్‌నాథ్ గౌడ్, గౌరీ శంకర్ గౌడ్, అనిరుధ్ గౌడ్, దుర్గా గౌడ్ తెలిపారు. సుమారు 180 ఏండ్లకు పైగా చేప ప్రసాదం పంపిణీ జరుగుతోందని, ఎక్కడా ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్‌తోపాటు అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు శతాబ్దాలుగా బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తోందని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



