బైకును ఢీకొన్న కారు.. ఇద్దరి దుర్మ‌ర‌ణం

– కారులోని వ్యక్తులు పరార్

హైదరాబాద్, మే 13 : హైదరాబాద్ నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఓ కారు బుధవారం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు మౌలాలికి చెందిన గణెశ్, గంగాధర్‌గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వ్యక్తులు పరారయ్యారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాచారం పోలీస్ స్టేషన్ వద్ద మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *