అధికారంలోకి రావడమే బీజేపీ టార్గెట్‌

-‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు

దిల్లీ, ప్ర‌జాతంత్ర‌,ఆగస్టు 7: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే బీజేపీ టార్గెట్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు  అన్నారు. అధికారం చేపట్టే విషయంలో ఎవరితోనూ పొత్తు ఉండదన్నారు. జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు. అయితే ఎన్డీయే కూటమిలో జనసేన భాగస్వామి అని, దానిపై జాతీయస్థాయిలోనే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. రామచందర్‌ ‌రావు, కేంద్ర మంత్రులు కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌, ఎం‌పీలతో జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ దిల్లీలో శుక్ర‌వారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై కీలకంగా చర్చించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు. సంస్థాగత విస్తరణ, భవిష్యత్‌ ‌కార్యాచరణపైనా చర్చ జరిగింది. అనంతరం రామచందర్‌ ‌రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం కోసం రోడ్‌ ‌మ్యాప్‌ ‌సిద్ధం చేస్తున్నామని, 937 మండలాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని, కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌ ‌తరహాలో ఇక్కడా విజయం సాధించి అధికారం చేపడతామన్నారు. రాష్ట్రంలోని కీలక నేతలంతా బీజేపీలో చేరేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతల మధ్య విభేదాలు లేవని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని రామచందర్‌ ‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, కలిసి పోరాటం చేయాలని నితిన్‌ ‌నబిన్‌ ‌దిశానిర్దేశం చేశారన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మరోసారి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి నితిన్‌ ‌నబిన్‌ రాష్ట్రానికి వస్తారని, ఇక్కడి నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ప్రజా సమస్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడతామన్నారు. ఈ సమావేశంలో సునీల్‌ ‌బన్సల్‌, అభయ్‌ ‌పాటిల్‌ ‌వంటి నేతలు కూడా పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *