అధికారులను కోర్టుకు పిలిపించడం బాధగా ఉంది

– ఐఏఎస్‌ ‌సందీప్‌ ‌సుల్తానియా కేసు విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 7: కోర్టు ‌ధిక్కరణ వ్యవహారంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ ‌సుల్తానియా హైకోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సందీప్‌ ‌సుల్తానియాపై వెయ్యి కేసులు ఉన్నాయని, అవన్నీ విచారణ చేస్తే జీవిత కాలం జైల్లో ఉండాలని పేర్కొంది. ప్రభుత్వాలు చేసిన తప్పు వ‌ల్ల‌ అధికారులకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అధికారులను హైకోర్టుకు పిలిపించడం బాధగా ఉందని, తప్పని పరిస్థితుల్లో హాజరుకావాలని ఆదేశిస్తున్నామని న్యాయస్థానం తెలిపింది. ఉచిత పథకాల వల్ల చాలా ప్రమాదం ఉందని, రైతుబంధు అనేది సంపన్నులు, అధికారులు కూడా తీసుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. రైతుబంధుతో రాష్ట్ర ఖజానాకు భారమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *