– బస్సు బోల్తాపడి 15మంది మృతి
శ్రీనగర్, ఏప్రిల్ 20: జమ్మూ కాశ్మీర్ కాగోర్ట్ సమీపంలోని రామ్‌నగర్- ఉదంపూర్ జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి అక్కడినుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని ఉదంపూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. జిల్లా ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం కారణంగా బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఉదంపూర్ జిల్లా ఉన్నతాధికారులతో స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం కోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు సాధ్యమైన మేరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ మేరకు తన ‘ఎక్స’ ఖాతా ద్వారా స్పందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




