-కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎంపీ చామల
న్యూదిల్లీ,జూలై21: పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు అడిగిన అంశాలకు కేంద్రం ఎందుకు సమాధానం చెప్పట్లేదని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సీజేపీ పార్టీ మద్దతుదారు, కార్యకర్తలను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎంపీలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడారు. ర్యాలీ సందర్భంగా సీజేపీ కార్యకర్తలపై దిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేశారని అన్నారు. ఈ ఘటనలో పలువురు సీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని వెల్లడించారు. ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో సీజేపీ కార్యకర్తలను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి పరామర్శించినట్లు ఎంపీ చామల చెప్పుకొచ్చారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్‌తో ఎందుకు రాజీనామా చేయించట్లేదని ఎంపీ చామల నిలదీశారు. ప్రధాని మోదీని మూడోసారి ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను మోదీ పరిష్కరించే దిశగా ఎందుకు ముందుకు పోవట్లేదని నిలదీశారు. రైతులు హరియాణాలో ఆందోళన చేస్తున్నారని, వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





