తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేశారు

– ప్రజల ఆశలపై మట్టి చ‌ల్లారు
– అవినీతి అక్రమాలతో నట్టేట ముంచారు
– హరీష్‌ ‌రావు విమర్శలపై మండిపడ్డ మంత్రి తుమ్మల

ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : ప్రజలు తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలపై పదేళ్లుగా మన్ను పోశారంటూ బీఆర్‌ఎస్‌పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ప్రజలను వంచించి, వ్యవస్థలను దోచుకున్నారని విమర్శించారు. అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని రావణ కాష్ఠం చేశారని మండిపడ్డారు. మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీల విలువలను కాదని, పూర్వీకుల మాట పక్కన పెట్టి అహంకారంతో, దౌర్జన్యంతో పాలన చేశారని విమర్శించారు. ఒక్కొక్కరిపై వందల కేసులు పెట్టి కబ్జా కోరులు కబ్జా చేసిన స్థలంలో విÖటింగ్ పెట్టి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌లో కాళేశ్వరరావు అనే హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉందని, ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అవమానాలతో ఆయన మానసిక స్థితి సరిగా లేదన్నారు. ఆయనకు ఒక్కటే పని.. ఎక్కడికి వెళ్లినా ఒకే ఆవు కథ, ఒకే రికార్డింగ్ క్యాసెట్ వినిపించడమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదవి పోయిన బాధలో, అస్తిత్వంతో బీఆర్‌ఎస్ నాయకులు ఇతర పార్టీలను విమర్శిస్తున్నారని తుమ్మల తెలిపారు. అహంకారంతో వ్యవస్థలను సర్వనాశనం చేశారు.. మీరు, మీ కుటుంబం, మీ తాబేదారులు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలు అధికారానికి దూరం పెట్టినా బుద్ధి రాలేదన్నారు. సీతారామసాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు బీఆరఎస్‌కు లేదన్నారు. సీతారామ నా రాజకీయ ఆకాంక్ష.. నా జీవిత లక్ష్యం అని తుమ్మల స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి దుమ్ముగూడెం పేరుతో పనులు చేపట్టారని.. ఆయన మరణానంతరం ఆగిపోయిందని చెప్పారు. కేంద్రం, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉండాలంటే కాదని గోదావరినే రిజర్వాయర్‌గా చూపించారన్నారు. బీఆర్‌ఎస్ చేపట్టిన ప్రాజెక్టు డిజైన్ లోపభూయిష్టంతో ఉందని, కమీషన్ల కోసం అవసరమైన పనులు మాత్రమే చేపట్టారని మంత్రి విమర్శించారు. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి రూ.వంద కోట్లతో గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌లో నింపామన్నారు. సత్తుపల్లి టన్నెల్‌కు రేవంత్ రెడ్డి రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. కనీసం హెడ్ వర్క్స్ లిప్ట్ కూడా బీఆర్‌ఎస్‌ పూర్తి చేయలేకపోయిందని, వారి నిర్వాకంతో జూలూరుపాడు టన్నెల్‌కు ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకురావాల్సి వస్తోందని చెప్పారు. ఎన్నికల ముందు వందల పనులకు శంకుస్థాపన చేసి ప్రజలను మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రి పెద్ద మనస్సుతో ఆ పనులన్నీ పూర్తి చేయిస్తున్నారని వివరించారు. హరీశ్ హెల్త్ మినిస్టర్‌గా తన పోర్ట్‌ఫోలియోలో సీఎం రిలీఫ్ ఫండ్ దండుకున్నారని, చివరకు దళిత బంధు కూడా దోచుకున్నారని ఆరోపించారు. మీ దోపిడీ, అవినీతిని గుర్తించి ప్రజలు విÖకు చరమగీతం పాడారు.. బతికి ఉండగా మీరు అధికారంలోకి రారు అని స్పష్టం చేశారు. హరీశ్‌కు అక్కడ (బీఆర్‌ఎస్ ) స్థానం లేదు. మొన్న వరంగల్ విÖటింగ్‌లో కూడా పక్కన పెట్టారు. కనీసం నీ ఫోటో కూడా వరంగల్‌లో లేదు. కాళేశ్వరరావు పేరు పెట్టుకున్న నీకు కాలేశ్వరం ప్రారంభోత్సవానికి కనీసం పిలుపు లేదు. అక్కడ నీకు చోటు లేదు.

కాగా, రుణ మాఫీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ చరిత్ర సృష్టించారని వెల్లడించారు. రూ.21 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయని, దేశంలో రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రుణ మాఫీపై విమర్శలు చేసే హక్కు హరీష్‌కు లేదన్నారు. కబ్జాలు, కమీషన్ల గురించి బీఆర్‌ఎస్ కు తెలిసినంత ఏ పార్టీకీ తెలియదన్నారు. సిద్దిపేటలో ఆరు నెలల్లో అత్యాధునిక టెక్నాలజీతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించామని చెప్పారు. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని స్పష్టం చేశారు. అవినీతిపరుల విమర్శలు, శాపనార్థాలు పట్టించుకోమన్నారు. రెండేళ్ల పాలనలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని, రాష్ట్రంలో అన్ని వర్గాలు, అన్ని జాతులకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *