అల్బేనియాలో పుట్టింది
రోమన్ క్యాథలిక్ సన్యాసిని అయింది
భారత పౌరసత్వం స్వీకరించింది
మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించింది
నూట ఇరవై మూడు దేశాలకు విస్తరింపజేసింది
పేదలను అక్కున చేర్చుకుంది
రోగస్తులను ఆదరించింది
అనాధలకు అండగా నిలిచింది
శరణాలయాలను నెలకొల్పింది
అనేక పాఠశాలలను స్థాపించింది
మరణ శయ్య పై ఉన్నవారికి పరిచర్యలు చేసింది
మానవతావాదిగా అంతర్జాతీయ కీర్తి పొందింది
మానవసేవే మాధవ సేవ అనుకుంద
నోబెల్ శాంతి పురస్కారాన్ని పొందింది
సేవలో తరించింది
భారతరత్న పురస్కారం
ఆమెను వరించింది
ఆమె మరణాంతరం
పోప్ జాన్ పాల్ చే
బ్లెస్డ్ థెరిసా ఆఫ్ కలకత్తా బిరుదు పొందింది
సేవా తాత్పరిణి మదర్ థెరిసా ఆమె
-గాదిరాజు రంగరాజు
8790122275
(నేడు ఆమె జన్మ దినోత్సవం సందర్భంగా )