సివిల్స్‌లో ముగ్గురు టాపర్లు అమ్మాయిలే

  • తొలి ర్యాంక్‌ ‌సాధించిన శృతిశర్మ
  • తెలుగువారికీ పలు ర్యాంకులు

న్యూ దిల్లీ, మే 30 : సివిల్స్ ‌సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా చాటారు. ముగ్గురు టాపర్లు అమ్మాయిలే కావడం గమనార్హం. సివిల్స్ ‌సర్వీసెస్‌-2021 ‌ఫలితాలు సోమవారం ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని యూపీఎస్సీ బోర్డు ఎంపిక చేసింది. 2021 సివిల్స్ ‌పరీక్షల్లో టాపర్‌గా నిలిచింది శృతి శర్మ. రెండో ర్యాంకర్‌గా అంకితా అగర్వాల్‌, ‌మూడో ర్యాంకర్‌ ‌గామిని సింగ్లా నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్‌కుమార్‌ ‌రెడ్డికి 15వ ర్యాంక్‌ ‌దక్కింది. పూసపాటి సాహిత్యకు జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్‌, ‌శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్‌, ‌రవికుమార్‌కు 38వ ర్యాంక్‌, ‌కొప్పిశెట్టి కిర్మణయికి 56వ ర్యాంక్‌ ‌దక్కింది. పాణిగ్రహి కార్తీక్‌కు 63వ ర్యాంక్‌, ‌గడ్డం సుధీర్‌కుమార్‌కు 69వ ర్యాంక్‌, ‌శైలజ 83వ ర్యాంక్‌, ‌శివానందం 87వ ర్యాంక్‌, ఆకునూరి నరేష్‌కు 117వ ర్యాంక్‌, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్‌, ‌గడిగె వినయ్‌కుమార్‌ 151 ‌ర్యాంక్‌, ‌దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్‌, ‌కన్నెధార మనోజ్‌కుమార్‌కు 157వ ర్యాంక్‌, ‌బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్‌, ‌దొంతుల జీనత్‌ ‌చంద్రకు 201వ ర్యాంక్‌, అకవరం సాస్యరెడ్డికి సివిల్స్ ‌జాతీయ స్థాయిలో 214వ ర్యాంక్‌ ‌దక్కాయి.

జనరల్‌ ‌కోటాలో 244, ఈడబ్ల్యూఎస్‌ ‌నుంచి 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఎంపికయ్యారు. ఐఏఎస్‌కు 180 మంది, ఐపీఎస్‌కు 200 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. సెంట్రల్‌ ‌సర్వీసెస్‌ ‌గ్రూప్‌ ఏ ‌కేటగిరీకి 242 మంది, 90 మంది గ్రూప్‌ ‌బీ సర్వీసులకు ఎంపికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page