సిద్ధిపేట పరిశుభ్రతలో శుద్ధిపేటగా కావాలె..

  • తాడిపత్రి మునిసిపల్‌ ‌తరహాలో మిగులు బడ్జెట్‌ ఉం‌డాలె..
  • బెంగళూరు వెళ్లి చూసి రండి..
  • సిద్ధిపేట మునిసిపల్‌ ‌సమావేశంలో మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, మే 28(ప్రజాతంత్ర బ్యూరో) : సుందరమైన సిద్ధిపేట పరిశుభ్రతలో శుద్ధిపేటగా కావాలి అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సూచించారు.  అందమైన ఆకుపచ్చ, ఆహ్లాదకరమైన సిద్ధిపేట పట్టణం చేద్దాం. ఇందుకు మున్సిపాలిటీ కౌన్సిలర్ల సహకారం అవసరం. నిధులు ఖర్చు చేయడం కంటే.. సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం  సిద్ధిపేట మునిసిపల్‌ ‌సాధారణ సమావేశానికి హాజరైన మంత్రి హరీష్‌రావు పట్టణ అభివృద్ధి పనులపై మునిపిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌  ‌కడవేర్గు మంజుల రాజనర్సు, అడిషనల్‌ ‌జిల్లా కలెక్టర్‌ (‌లోకల్‌ ‌బాడీస్‌ )‌ముజమ్మీల్‌ ‌ఖాన్‌, ‌వైస్‌ ‌ఛైర్మన్‌ ‌జంగిటి కనకరాజు, మునిసిపల్‌ ‌కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… పట్టణంలో అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ-యూజీడీ పూర్తయినా.. పలుచోట్ల యూజీడీ కనెక్షన్లు పూర్తి కాలేదనీ, మునిసిపల్‌ ‌కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పని చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.  మున్సిపాలిటీ పన్ను వసూళ్లు చేసి తాడిపత్రి మున్సిపాలిటీ తరహాలో మిగులు బడ్జెట్‌ ఉం‌డేలా సద్వినియోగం చేసుకుని పట్టణ ప్రజలకు సేవ చేయాలని అధికారులకు, కౌన్సిల్‌ ‌వర్గాలకు సూచించారు.  సిద్ధిపేట పట్టణ తాగునీటి కోసం ప్రతి నెలా 80 లక్షలు కరెంటు బిల్లు చెల్లింపు చేస్తున్నామని వెల్లడించారు. రోజుకూ పట్టణంలో పన్నెండున్నర టన్నులు రావాల్సిన చోట కేవలం 7 టన్నుల పొడిచెత్త వస్తున్న దృష్ట్యా.. డీఆర్సీసీలోనే పొడి చెత్త సెగ్రిగేషన్‌ ‌జరగాలనీ,  బెంగళూరుకు వెళ్లి చూసి వచ్చి సిద్ధిపేటలో అమలయ్యేలా చూడాలని మునిసిపల్‌ ‌కౌన్సిల్‌, అధికార వర్గాలకు మంత్రి సూచించారు.  బుస్సాపూర్‌ ‌డంపింగ్‌ ‌యార్డుకు కేవలం తడిచెత్త మాత్రమే పోయేలా చూడాలని ఆదేశించారు. బ్లాక్‌ ‌స్పాట్లలో చెత్త వేసిన వారిపై తప్పనిసరిగా జరిమానా విధించాలనీ, మునిసిపల్‌ ‌కౌన్సిల్‌ ఏజెండా తీర్మాణంలో ఎంతమందికి జరిమానా విధించారో.. తెలిపేలా మొదటి ప్రాధాన్యత ఉండాలన్నారు.  పట్టణంలో 127 బ్లాక్‌ ‌స్పాట్లు ఉంటే., ప్రస్తుతం 88 బ్లాక్‌ ‌స్పాట్లు ఉన్నాయని, అన్నీచోట్ల సిసి కెమెరాలు బిగించి పోలీసు నిఘా విభాగాన్ని ఏర్పాట్లకు మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *