కష్టమైనా ఇష్టంగ,ఇగురంగ
ఆరుగాలం ఎవుసం చేస్తుండు
గాదెల నిండా ధాన్యం నింపి
అందరి ఆకలి తీరుస్తున్న
అన్నదాత అనే బిరుదాంకితుడు
అంగట్లో ధరల శరాఘాతాలు తింటు
అందరికి అన్నం తినిపిస్తుండు!
కొనే వాడు సరుకులమ్మే కొట్టులో
పెట్టిన ధరలకే సరుకులు కొంటున్నడు
అన్నదాత అమ్మేవాడైనా
కొనేవాని చెంతకు పోయి వాడు
ఇచ్చిన ధరకే ధాన్యం అమ్ముకుంటున్నడు
తన పంటకు తానే ధర నిర్ణయించలేని
దయానియ స్థితి ఒక్క రైతన్నకే!
వాడు ‘అమ్మ’లేని వాడు కాదు
వాడే కనుక అలిగితే…
కొట్టులన్నిటికి తాళం కొట్టుడే!
రాముడెవడో రావణుడెవడో
శూర్పణక లే చెప్పాలా!
ప్రామాణిక అనుశాసనం పాటించరా
లక్ష్మణ రేఖను లెక్కచేయరా!
ఒక్క నిజ శరము లేదా!
పది శిరముల తప్పును ఖండించ!
సాలు సాలుకు యాతనల సాగు
సాలీడు పదే పదే అల్లే దారం పోగు!
– పి.బక్కారెడ్డి
9705315250