Take a fresh look at your lifestyle.

విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ ‌సమ్మిట్‌

  • ‌ప్రపంచ పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం
  • లోగోను ఆవిష్కరించిన సిఎం జగన్‌
  • ‌విశాఖ ఎయర్‌పోర్టు శంకుస్థాపనకు ప్రధాని మోడీకి వినతి
  • వచ్చే ఏడాది నిర్వహిస్తామన్న మంత్రి అమర్‌నాథ్‌

అమరావతి, నవంబర్‌ 8 : ‌వచ్చే ఏడాది విశాఖపట్నం వేదికగా ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ ‌సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ‌తెలిపారు. మార్చి 3,4 తేదీల్లో నిర్వహించే ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్టాన్రికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ’గత మూడేళ్లలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సమ్మిట్‌ ‌నిర్వహించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేలా ఈ సమ్మిట్‌ను ఘనంగా నిర్వహించ నున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ సమ్మిట్‌ ‌ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాం. సమ్మిట్‌ ‌కు ముందు పలు దేశాల్లో రోడ్‌ ‌షోలు నిర్వహణ ద్వారా పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తాం. ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ఏపీ లోని పారిశ్రామిక వేత్తలే బ్రాండ్‌ అం‌బాసిడర్లుగా వ్యవహరిస్తారు’ అని మంత్రి పేర్కొన్నారు.

 

ఇదిలావుంటే సమ్మిట్‌కు సంబంధించిన లోగోను సిఎం జగన్‌ ఆవిష్కరించారు. కాగా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా అగ్రి, మెరైన్‌, ‌డిఫెన్స్, ఆటోమోటివ్‌, ఎలక్ట్రిక్‌ ‌వెహికల్స్, ‌టూరిజం,హెల్త్ ‌కేర్‌ ‌రంగాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే భావనపాడు, మచిలీపట్నం పోర్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. జనవరి 2024 నాటికి రామాయపట్నం పోర్టుకు మొదటి ఓడను తీసుకోస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు ఇక ప్రధాని మోడీ విశాఖ పర్యటనపై మాట్లాడుతూ ’ 11 న రాత్రి విశాఖ చేరుకుంటారు. 12 న పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్‌ ‌పోర్ట్ ‌శంఖుస్థాపన పై పీఎంవోకి లేఖ రాశాం. ప్రధాని కార్యాలయం అంగీకరిస్తే అదే రోజు శంకుస్థాపన ఉంటుంది’ అని అమర్‌నాథ్‌ ‌తెలిపారు.చాలా కాలంగా వాయిదాపడుతూ వచ్చిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి క్లియరెన్స్ ‌వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్‌ 12 ‌విశాఖపట్నంకు వచ్చి శంకుస్థాపన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాసింది.

 

అయితే మోడీ పర్యటనలో దానిని ప్రధానమంత్రి కార్యాలయం చేర్చలేదని అధికార వర్గాలు తెలిపాయి. విశాఖపట్నానికి ఈశాన్యంగా 40కి. దూరంలో ఉన్న భోగాపురంలో పబ్లిక్‌-‌ప్రయివేట్‌ ‌భాగస్వామ్యం పద్ధతిలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర విభజన తర్వాత 2014లో యోచించారు. ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం భారత వాయుసేనకు చెందినది. ప్రస్తుతం విశాఖపట్నం లో ప్రణాళికలోని అన్నింటిని పక్కనపెట్టేసి అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్క దానినే అభివృద్ధి చేయబోతున్నారు. అంతర్జాతీయ విమానశ్రయం డిజైనింగ్‌, ‌బిల్డింగ్‌, ‌ఫైనాన్సింగ్‌, ‌నిర్మాణం, అభివృద్ధి, 40 ఏళ్ల పాటు విమానాశ్రయం గ్రీన్‌ఫీల్డ్ ఆపరేటింగ్‌ అం‌డ్‌ ‌మెయిన్‌టెయినింగ్‌కు రూ. 3000 కోట్లు కాగలదని జిఎంఆర్‌ ‌వర్గాలు తెలిపాయి.

Leave a Reply