ఎమ్మెల్యే ఆనంద్ ని గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గంలో ఏకకాలంలో దళితులకు దళిత బంధు.
అనంతగిరి కొండలను టూరిజం గా అభివృద్ధి చేస్తాం.
అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అభివృద్ధి.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 23: మరోసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆనంద్ ను గెలిపించుకుంటే ఏకకాలంలో వికారాబాద్ నియోజకవర్గంలో దళితులందరికీ దళిత బంధు ప్రారంభిస్తామని తెలిపారు. మరోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వొస్తే వికారాబాద్ ప్రాంతాన్ని ఐటి హద్దుగా తీర్చిదిద్దుతామని ఐటి హబ్ గా తీర్చిదిద్దితే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. వికారాబాద్ అనంతగిరి కొండలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అదేవిధంగా ఎంతో పురాతనమైన మహిమాన్విత మూర్తి అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అభివృద్ధిలో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అనంతగిరి కొండలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ముస్లింలు హిందువులు నాకు రెండు కండ్ల లాంటి వారిని తెలంగాణ రాష్ట్రం నేను బతికున్నంత వరకు సెక్యులర్ రాష్ట్రంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వికారాబాద్ కు నర్సింగ్ కాలేజ్ మంజూరు చేస్తామని సీఎం తెలిపారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ విద్యావంతుడు నాకు చాలా దగ్గర మనిషి మరోసారి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సీఎం కేసీఆర్ వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ వికారాబాద్ పట్టణానికి రింగ్ రోడ్డు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.