Take a fresh look at your lifestyle.

లిప్ట్ ఇచ్చిన పాపానికి.. ప్రాణాలు తీసి బైక్‌తో పరారీ!

ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌లిప్ట్ ఇచ్చిన వ్యక్తి ప్రాణాలు తీసి పరారయ్యాడు ఓ దుండగుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద చోటు చేసుకున్నది. వలభి సవి•పంలో ఓ దుండగుడు ద్విచక్ర వాహనారుడిని లిప్ట్ అడగ్గా.. లిప్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దుండగుడు ఇంజక్షన్‌ ఇచ్చాడు.

ఆ తర్వాత బైక్‌తో పరారయ్యాడు. మృతుడిని చింతకాని మండల వాసి జమాల్‌ ‌సాహెబ్‌ (40)‌గా గుర్తించారు. దుండగుడు గుర్తుపట్టకుండా మాస్క్ ‌ధరించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టిస్తున్నది.

Leave a Reply